Home Cinema Keerthy Suresh: కీర్తీ సురేష్ హీరోయిన్ అవ్వకపోయ్యుంటే అలాంటి పనే చేసేదంట..

Keerthy Suresh: కీర్తీ సురేష్ హీరోయిన్ అవ్వకపోయ్యుంటే అలాంటి పనే చేసేదంట..

Heroine Keerthy Suresh: కీర్తి సురేష్ తన సినీ కెరియర్ ను మలయాళంలో మొదలు పెట్టినప్పటికీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని హీరోయిన్లలో ఒక స్టార్ హీరోయిన్ గా తను గుర్తింపు సాధించింది. మలయాళ సినీ నిర్మాత అయిన సురేష్ కుమార్ మరియు మలయాళ నటి మేనకల గారాల పట్టి కీర్తి సురేష్. మొదటిసారి 2000 సంవత్సరంలో బాలనాటిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కీర్తి సురేష్. చిన్నతనంలోనే ఎన్నో చిత్రాలలో నటించి 2013 వ సంవత్సరంలో గీతాంజలి అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా మారింది. ఆ తరువాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలు అడుగుపెట్టి అది తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా తనదైన శైలిలో గుర్తింపు దక్కించుకుంది.

keerthy-suresh-would-have-done-such-a-thing-if-she-had-not-become-a-heroine

కోలీవుడ్ కు చెందిన ఈ భామ కోలీవుడ్ లో కంటే టాలీవుడ్ లోనే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కైవసం చేసుకోండి. తనదైన శైలిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకొని మహానటి చిత్రం తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఆ జాబితాలో నిల్చుంది. హీరో నాని సరసన మార్చిలో విడుదలైన దసరా చిత్రంతో ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు దక్కించుకుని బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది కీర్తి సురేష్.. తమిళంలో పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ మూవీ చిత్రంతో మరొక సూపర్ హిట్ ను అందుకుంది కీర్తి సురేష్.

See also  Shriya Saran: తెలుగు స్టార్ నిర్మాత శ్రియ కత్తిలాగా సూపర్ ఫిగర్ అంటూ ఆమె రేట్ రాసి చెక్ ఇచ్చాడట.. ఎంతో తెలుసా..?

keerthy-suresh-would-have-done-such-a-thing-if-she-had-not-become-a-heroine

ఇక ఈ చిత్రంలో ఉదయనిది స్టాలిన్, ఫహద్ ఫాజిల్, వడివేలు, కీర్తి సురేష్ మొదలైన వారు ప్రధాన పాత్రలో పోషించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దున్నేస్తూ కాసుల వర్షాన్ని కురిపించింది. అయితే ఈ చిత్రాన్ని త్వరలో తెలుగులో కూడా రీమేక్ చేయనున్నారు. నాయకుడు అనే పేరుతో ఈ చిత్రం త్వరలో తెలుగులో కూడా విడుదలబోతుంది. బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ హిట్స్ కొట్టడంతో కీర్తి సురేష్ ఆనందానికి అవధులు లేకుండా ఫుల్ ఖుషి గా ఉంది. ఆమె అభిమానులు కూడా సంతోషంలో మునిగిపోయారు. దాంతో తదుపరి చిత్రాలపై మరింత ఫోకస్ పెట్టింది కీర్తి సురేష్.

See also  Lavanya Tripathi : ఆ జబ్బుతో బాధపడుతున్న లావణ్య త్రిపాఠి.. సమంతకీ కూడా!

keerthy-suresh-would-have-done-such-a-thing-if-she-had-not-become-a-heroine

ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగు ఇండస్ట్రీలో మరియు తమిళ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో బిజీ బిజీగా ఉన్న కీర్తి సురేష్.. గురించి ప్రస్తుతం నెట్టింట ఓ వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే.. కీర్తి సురేష్ హీరోయిన్ అవ్వకపోతే ఏమి చేసేది ఎలాంటి పని ఎంపిక చేసుకునేది అంటే తను కచ్చితంగా ఫ్యాషన్ డిజైనర్ అయ్యేదట.. ఈ విషయాన్ని స్వయంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తనే తెలిపింది. హీరోయిన్ గా తన కెరియర్ ను మొదలుపెట్టక ముందే ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ ను చెన్నైలో పూర్తి చేసిందట. కానీ ఆమె అదృష్టం కొద్దీ హీరోయిన్ గా మారడమే కాకుండా స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగి ప్రస్తుతం సూపర్ సక్సెస్ దిశగా కొనసాగుతోంది ఆమె జీవితం. ప్రస్తుతం (Heroine Keerthy Suresh) కీర్తీ సురేష్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం భోళా శంకర్ లో ఆయనకు చెల్లిగా నటిస్తోంది.