Prabhas : ఇప్పటికే ప్రభాస్ అభిమానులు ప్రభాస్ విషయంలో ప్రతి దాంట్లో కూడా ఎంతో ఆత్రంగా ఉన్నారు. దానికి కారణం లేకపోలేదు.. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ ఎప్పుడు వస్తుందా అని.. వేయి కళ్ళతో ( Kalki 2898 AD Prabhas ) ఎదురుచూస్తున్నారు. అభిమానులు బాహుబలి సినిమా తర్వాత రిలీజ్ అయిన మూడు సినిమాలు కూడా అందరినీ నిరాశపరిచాయి. ప్రతిదీ కూడా భారీ అంచనాలతోనే రిలీజ్ అయ్యి చాలా బాధనే మిగులుతాయి. ఇలాంటి తరుణంలో ప్రభాస్ నెక్స్ట్ సినిమా Kalki 2898 AD ఈ సినిమాపై భారీ అంచనాలతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇది 2024 జనవరిలో జనవరి 12న రిలీజ్ సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది. ఇక పండగల్లో ఈ సినిమా దుమ్ము రేపుతుందని అభిమానులు అంచనాలతో ఉన్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు Kalki 2898 AD సినిమా రిలీజ్ పై ఒక కొత్త అప్డేట్ వినిపిస్తుంది. మరి ఈ వార్త అఫీషియల్ గా చిత్ర బృందం నుంచి విడుదల అయితే ఇంతవరకు కాలేదుగాని.. ఎక్కడ చూసినా ఈ అప్డేట్ మాత్రం వైరల్ అవుతుంది. ఒకవేళ అదే ( Kalki 2898 AD Prabhas ) నిజమైతే.. అభిమానులకు చాలా బాధే మిగులుతుంది. అసలు అలాంటి దానికి ప్రభాస్ ఎలా ఒప్పుకున్నాడు అంటూ అభిమానులు వాపోతున్నారు. ఇంతకీ అసలు సంగతేంటంటే.. Kalki 2898 AD సినిమా ని 2024 జనవరి 12న కాకుండా 2024 మే 9న సమ్మర్ హాలిడేస్ లో రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారంట. దీంతో సినిమా మళ్లీ పోస్ట్ పోన్ అవడంతో అభిమానులు అందరూ చాలా నిరాశపడుతున్నారు. ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న సినిమా ఇలా పోస్ట్ పోన్ అవుతుంటే.. అది కొంత నెగిటివ్ గా కూడా ఫీల్ అవుతున్నారు.
Kalki 2898 AD విడుదల చేయడానికి డేట్ ని మార్చడానికి కారణం లేకపోలేదంట.. సైన్స్ ఫిక్షన్ సినిమా అవడం వల్ల చాలా ముఖ్యమైన సన్నివేశాలు అన్నిట్లోనూ గ్రాఫిక్స్ ఎక్కువగా అవసరం పడటం వల్ల.. గ్రాఫిక్స్ నిర్మాణం విలువలు ఎక్కువగా ఉంటాయంట. అందువలన ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు ఇప్పుడు ప్రజెంట్ ( Kalki 2898 AD Prabhas ) జరుగుతూ ఉండటం వలన.. ఇందులో ఎక్కువగా సీన్లన్నీ VFX ఆధారపడి ఉండటం వలన చిత్ర బృందం కచ్చితంగా ఇది టైం పడుతుందని.. అందువలన సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ చేస్తే మంచిదని అనుకుంటున్నారంట. పైగా ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం అంతా కూడా ఆడాలంటే సమ్మర్ హాలిడేస్ బెస్ట్ అని అనుకుంటున్నారంట.
అయితే కారణం ఏదైనా కావచ్చు.. ఒక సినిమాని రిలీజ్ చేయడానికి ఇలా ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ పోతూ ఉంటే.. అది సెంటిమెంట్ గా అలాంటి సినిమాలు ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని.. ఆయన పాన్ ఇండియా సినిమాగా నిర్మించిన సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎక్కడకో తీసుకెళ్లిన రాజమౌళి కూడా సినిమా రిలీజ్ డేట్ ని సిద్ధం చేయడం కొంత లేటు చేసినా కూడా డేట్ అంటే ఆ రిలీజ్ డేట్ లోనే రిలీజ్ చేసిన సినిమాలు ఉన్నాయని.. బాహుబలి లాంటి సినిమా నే అనుకున్న డేట్ కి రిలీజ్ చేసి సంచలనం సృష్టించారని.. ఇప్పుడు కూడా అలాగే చేయొచ్చు కదా అని అభిమానులు అంటున్నారు. ఎందుకో పాపం ప్రభాస్ అభిమానులు సెంటిమెంటల్ గా ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు. అలాగే ప్రభాస్ కూడా ఎందుకు ఇలాంటి దానికి ఒప్పుకున్నాడు అని అనుకుంటున్నారు. ఏదేమైనా చిత్రబంధం వారి బాధ వాళ్ళ ఇబ్బందులు వాళ్లకి ఉంటాయిగా మరి..