Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ గా.. ప్రపంచవ్యాప్తంగా ఒక వెలుగు వెలుగుతున్న ప్రభాస్ హీరోగా.. నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న Kalki 2898 AD సినిమా పై యావత్ భారతదేశానికి విపరీతమైన భారీ అంచనాలు ( Kalki 2898AD movie concept leaked ) ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమాపై తమ చూపును వేసి ఉంచాయి. ఎంతో భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ సినిమా పై.. ప్రభాస్ అభిమానులైతే ప్రాణం పెట్టి ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అమితాబచ్చన్, దీపిక, కమల్ హాసన్ వంటి పెద్ద పెద్ద స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్, గ్లిమ్ప్స్ , ఫస్ట్ లుక్ అన్ని రిలీజ్ అయ్యాయి. వీటన్నింటిపై కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
అయితే ప్రభాస్ ఫస్ట్ లుక్ మాత్రం కొంత నెగిటివ్ కామెంట్స్ సంతరించుకుంది. ఆ తర్వాత టీజర్, గ్లిమ్ప్స్ చూసి సినిమాపై భారీ అంచనాలతో ఉన్నారు. ఈ సినిమా గురించి అమెరికాలోని శాండియాగో కామిన్‌కాన్ ఈవెంట్లో ఈ సినిమా టైటిల్ ని, ఫస్ట్ గ్లిమ్ప్స్ ని కూడా రిలీజ్ చేశారు. అలాగే హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని చిత్రీకరిస్తున్నట్టుగా ( Kalki 2898AD movie concept leaked ) వినిపించడంతో.. ఇక ప్రభాస్ హాలీవుడ్ లెవెల్ హీరో అవుతాడని.. మా హీరోకి ఎదురు లేదని అభిమానులు అందరూ ఎంతగానో పొంగిపోతున్నారు. ఈ సినిమా టైం మీద నడుస్తుందని అందరికీ తెలుసు కానీ.. సినిమా కథేమిటి? ఎలాంటి మూలాలు ఉంటాయి అనేది మాత్రం పెద్దగా ఎవరు ఊహించలేకపోతున్నారు.
అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసినదే. ఈ సందర్భంగా కమల్ హాసన్ కొన్ని ఇంటర్వూస్ లో పాల్గొని.. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.. కమల్ హాసన్ సినిమా గురించి మాట్లాడుతూ.. పురాణాలను, భవిష్యత్తులను కలబోసి ఈ చిత్ర దర్శకుడు ( Kalki 2898AD movie concept leaked ) ఈ సినిమా కథని తీసుకువచ్చారని.. ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పారు. అలాగే మనం వేల సంవత్సరాల క్రితం పురాణాలను పాటిస్తున్నామని కూడా చెప్పారు. దీన్ని బట్టి ఈ సినిమాలో పురాణాలను, భవిష్యత్తును రెండిటిని కలబోసి చూపిస్తారు అని.. అంటే దానిలో అర్ధాన్ని కథ మూలాన్ని వెతుకుతున్నారు నెటిజనులు. పైగా వేల సంవత్సరాలుగా పురాణాలను మనం పాటిస్తున్నాము అని కమల్ హాసన్ చెప్పారు అంటే.. ఈ సినిమా మూడు టైమింగ్స్ లో కథలను రాసి దాన్నిబట్టి తీసి ఉంటారని అనిపిస్తుంది..
పురాణాలలో ఉన్న వాటి గురించి.. వాటిని అవలంబిస్తూ ఇప్పటివరకు మానవుడు చేస్తున్న పనులు గురించి.. అలాగే పురాణాలను మర్చిపోయి ఫ్యూచర్లో చేయబోయే పరిస్థితుల గురించి ఈ సినిమా దర్శకులు చూపించి ఉంటాడని అందరూ అనుకుంటున్నారు. పురాణాలు – భవిష్యత్తు లో ఊహించని మార్పులు మలుపులు అద్భుతంగా చూపిస్తారని టాక్ వస్తుంది. కమల్ హాసన్ ఈ సినిమాలో నటిస్తాడని ఆయన ఎప్పుడూ అనుకోలేదంట. ప్రభాస్ కూడా అదే మాట అన్నాడని ఆయన చెప్పారు. ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ రోల్ లో నటిస్తున్నట్టుగా చెప్పారు. అలాగే ఇప్పటికే బాహుబలి సినిమా తర్వాత మంచి బ్లాక్ బస్టర్ లేక అల్లాడిపోతున్న ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై అలాంటి ఇలాంటి అంచనాలు పెట్టుకోలేదు.. వాటన్నిటిని సంతృప్తిపరిచే విధంగానే ఈ సినిమా ఉంటుందేమో అని యావత్ సినిమా రంగం ఎంతగానో ఎదురు చూస్తుంది.