Home News K.Viswanath: విశ్వనాధ్ గారు చనిపోవడానికి అసలు కారణం ఇదేనంట….

K.Viswanath: విశ్వనాధ్ గారు చనిపోవడానికి అసలు కారణం ఇదేనంట….

K.Viswanath: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో ఇవాళ తుది శ్వాస విడిచిపెట్టారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్రమైన విషాదం నెలకొంది. అగ్రదర్శకుడైన కళాతపస్వి బిరుదాంకితుడు ఇక లేడు. 50 సంవత్సరాలకు పైగా కళామతల్లికి సేవలందించి ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 1930 ఫిబ్రవరి 19న సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాధ్ జన్మించారు.

kala-tapawsvi-k-viswanath-passes-away

చెన్నైలో ఒక స్టూడియో సౌండ్ ఆర్టిస్టుగా ఆయన జీవితాన్ని ఆరంభించి, అంచలంచెలుగా ఎదుగుతూ ఆత్మగౌరవం సినిమాతో దర్శకునిగా మారాడు. ఎన్నో చిత్రాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతి కిరణం అంటే ఆల్ టైం హిట్ సినిమాలు ఇండియాలో మరెవ్వరు తీసి ఉండరు. 50పైగా చిత్రాలు దర్శకత్వం వహించాడు. తెలుగు పరిశ్రమ కిరీటానికే వజ్రం లాంటి ఆయన ఇక లేరు.

See also  2000 notes : 2000 నోట్ల రద్దుకు ప్రధాన కారణం ! ఇప్పుడు మనం ధైర్యంగా చేయాల్సిన పని ఇదే.

kala-tapawsvi-k-viswanath-passes-away

పెద్ద పెద్ద హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. సినిమా రంగంలో ఆయన కృషికి 1992లో రఘుపతి వెంకయ్య, పద్మశ్రీ పురస్కారాలు, 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. శ్వాసకు సంబంధించి ఆయన పడుతున్న ఇబ్బందిని గమనించి కుటుంబ సభ్యులు, అపోలో హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. అపోలో చైర్మన్ ఉపాసన విశ్వనాథ్ గారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేది.

స్పెషలిస్టులు ఆయన మెరుగుపడటానికి ఎంతో ప్రయత్నించినా, రక్షించేందుకు శక్తి మొత్తం ఉపయోగించినప్పటికీ, దురదృష్టం కొద్దీ కాపాడలేకపోయాం. శ్వాసకు సంబంధించిన ఇబ్బందితో చాలా కాలం బాధపడుతున్నాడని ఇది తీవ్ర రూపం దాల్చడంతో ఎమర్జెన్సీ వార్డుకి తరలించి చికిత్స నందించినప్పటికీ పెద్ద వయసు కాబట్టి చికిత్సకు స్పందించక ఇలా జరిగిందని చెప్పారు.