Kajol : రోజు రోజుకి ఇంటర్నెట్ ప్రపంచం ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. మనిషి టెక్నాలజీ నేర్చుకునే కొద్ది అభివృద్ధి వైపు వెళుతున్నాడని ఒకపక్క ఆనందంగా ఉంటే, మరోపక్క క్రిమినల్ బ్రెయిన్ తో నీచానికి దిగజారుతున్నాడని ( Kajol fake video ) ఇంకొకపక్క బాధగా ఉంటుంది. ఒకరు చేసిన తప్పుకి వేరేవరో శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఎంతటి ఘోరానికైనా దిగజారి చెయ్యొచ్చు అనుకునే మనుషులను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాంటి పనులు చేయడానికి ఎలా మనసొప్పుతోందని బాధ కలిగిస్తుంది.
ఇంటర్నెట్లో ఏఐ వాడుకొని ఒకరి ముఖంతో ఇంకొకరి బాడీ ని పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వీడియోలు తీస్తున్నారు. ఫేక్ వీడియోలతో సెలబ్రెటీస్ కి ఒక వణుకు పుట్టిస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటే.. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఇక ఆ నటీనటుల అభిమానులైతే ఇంకా ఎంతో రోదిస్తున్నారు. ఇటీవల ( Kajol fake video ) రష్మిక మందన్న మీద ఒక ఫేక్ వీడియో వస్తే అందరూ రియాక్ట్ అయ్యారు. అలాంటి వీడియోలు తీసే వాళ్ళని పట్టుకొని గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలని సెలబ్రిటీస్ సైతం చెప్పుకొచ్చారు.
రష్మిక మందన్న వీడియో గురించి ఇంతవరకు మర్చిపోలేదు కానీ.. మరొక వీడియో బయటకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ పై ఒక వీడియో వచ్చింది. కాజోల్ బట్టలు మార్చుకుంటున్నట్టు ఒక వీడియో తయారు చేశారు.అది ( Kajol fake video ) ఫేక్ వీడియో. అందులో ఎవరికో కాజల్ ముఖాన్ని ఏఐ ద్వారా అప్లై చేసి వీడియో చేశారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో వదిలి విపరీతంగా వైరల్ చేస్తున్నారు. భారతదేశంలో స్త్రీని గౌరవించే విధానం చూసి ఎన్నో దేశాలు గర్వపడుతుంటే.. మనం ఏదో దేశాల నుంచి టెక్నాలజీని అందుకుని మన స్త్రీని మనం అవమానించుకునే స్థితికి దిగజారుతున్నందుకు సిగ్గుపడాలి.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ పై తీసిన ఇలాంటి నీచమైన వీడియోను చూసి సోషల్ మీడియా ఒక వణుకు వణుకుతుంది. ఇలా అయితే ఎవరికి భద్రత ఉంటుంది అని భయంతో ఆలోచిస్తున్నారు. టెక్నాలజీ నేర్చుకొని నిజంగా అంత తెలివి ఉంటే మంచికి వాడొచ్చు కదా ఇదేమి అన్యాయం అని నెటిజనులు వాపోతున్నారు. ఏదేమైనా ఇలాంటి పనులు చేసే వారి మీద నిఘావేసి గట్టిగా యాక్షన్ తీసుకోవాలని నెటిజనులు కోరుకుంటున్నారు. సామాన్య నెటిజనులు మాత్రమే కాకుండా సెలబ్రిటీస్ సైతం.. వీటిపై గట్టిగా స్పందిస్తున్నారు. ఇలాంటి వాళ్లను వదలకూడదని అంటున్నారు.