Home Cinema Balakrishna : బాలకృష్ణని చూసి నేర్చుకోండి అంటూ స్టార్ హీరోలను అవమానించిన ఎన్టీఆర్ హీరోయిన్..

Balakrishna : బాలకృష్ణని చూసి నేర్చుకోండి అంటూ స్టార్ హీరోలను అవమానించిన ఎన్టీఆర్ హీరోయిన్..

junior-ntr-heroine-payal-gosh-comments-about-nandamuri-balakrishna

Balakrishna : నందమూరి బాలకృష్ణ అంటే నందమూరి అభిమానులకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ అంటేనే ఒక పెద్ద క్రేజ్. ఇలాంటి ఏజ్ లో కూడా ఆయన అంటే విపరీతంగా అభిమానించే అభిమానులు ఎందరో ఉన్నారు. అందుకే ఇప్పటికీ బాలకృష్ణ సినిమాలు ఈ జనరేషన్ వాళ్ళని కూడా ( Payal Gosh about Balakrishna ) ఎదుర్కొని నిలబడి సక్సెస్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నాయి. జై బాలయ్య అంటూ అభిమానులు ఆయన మీద చూపించే అభిమానం నిజంగా చాలా గొప్పతనం. సినిమాల్లో మాత్రమే కాకుండా టీవీ లైవ్ షో కి హోస్ట్ గా అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ కి చేస్తూ.. అభిమానులకు చాలా దగ్గరగా ఉంటున్నాడు బాలకృష్ణ.

See also  Amala Paul Marriage : అమలా పాల్ అంత సడన్ గా పెళ్లి చేసుకోవడానికి కారణం అదేనట..

Nandamuri-Balakrishna-movies

అయితే బాలకృష్ణ గురించి ఒక హీరోయిన్ ఒక కామెంట్ చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే పాయల్ గోష్. ఈ హీరోయిన్ మన తెలుగు సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించింది. ఊసరవెల్లి సినిమాలో తమన్నా ( Payal Gosh about Balakrishna ) ఫ్రెండ్ గా నటించి అందరికీ గుర్తుండిపోయింది.అంతేకాకుండా క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీని మొత్తాన్ని ఈమె షేక్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే.అలాగే ఈమె బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది గాని పెద్దగా పేరు సంపాదించలేకపోయింది.

See also  Krithi Shetty: అలాంటి పనులు చేస్తూ ఒక్కసారిగా సోషల్ మీడియా ను కుదిపేసిందిగా బేబమ్మ.. అదేంటంటే.?

Nandamuri-Balakrishna-Payal-gosh-bollywood

పాయల్ గోష్ బాలకృష్ణ గురించి చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. బాలయ్యను చూసి బాలీవుడ్ హీరోలు సైతం నేర్చుకోవాలని ఆమె అంటుంది. బాలయ్య ఈ వయసులో కూడా ( Payal Gosh about Balakrishna ) బ్లాక్ బస్టర్ కొడుతున్నాడని, అతను ఎనర్జీ, అతను నటన, అతని సక్సెస్ చూసి బాలీవుడ్ హీరోలు కు కౌంటర్ పడేలాగా గట్టిగా ఇచ్చుకుంది. తెలుగు హీరోలని చిన్నచూపు చూసే నార్త్ హీరోలకి సౌత్ హీరోల తరఫునుంచి ఈ అమ్మడు బాగా ఇచ్చింది. బాలక్రిష్ణని చూసి నేర్చుకోవాలి అని చెప్పుకొచ్చింది.

See also  Payal Rajput : ఎప్పుడు చేయలేదంటూ ఆ వీడియోని రిలీజ్ చేసేసిన పాయల్ రాజ్ పుత్.. వీడియో వైరల్..

Nandamuri-Balakrishna-payal-gosh-comments

ఆమె చెప్పిందని కాదు గాని బాలకృష్ణ ఇటీవల కాలంలో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి నిజంగానే మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ వయసులో కూడా బాలకృష్ణ అద్భుతంగా నటించి.. సక్సెస్ సాధిస్తున్నాడని చాలామంది కొనియాడుతున్నారు. అదే క్రమంలో ఇప్పుడు ఈ అమ్మడు కూడా బాలకృష్ణని తెగ పొగుడుతూ బాలీవుడ్ హీరోలకి అంటుకునేలాగా గట్టిగా ఇవ్వడం నందమూరి అభిమానులకు అయితే మాత్రం భలే ఆనందంగా ఉంది. ఇకపోతే నందమూరి బాలకృష్ణ 109 వ సినిమా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే.