Jr NTR : భగవంతుడు ప్రతి మనిషికి కొన్ని వరాలిస్తాడు. మనం కోరుకున్న కోరుకోకపోయినా కొన్ని వాటంత అవే వస్తాయి. మరికొన్ని మనం ఎంత కోరుకున్నా కూడా భగవంతుడు మనకి ఇవ్వడు. అది సామాన్యుడి నుంచి సెలబ్రిటీస్ వరకు జరిగే ప్రక్రియ జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడు మాత్రమే కాకుండా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ హీరో. ఇటీవల కాలంలో ఆయన సక్సెస్ లో అందుకుంటున్న అవార్డులు మనందరికీ తెలిసినవే. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR wish not come true) కి ఎన్నో కోట్ల ఆస్తి కూడా ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే.
ఎన్ని కోట్ల ఆస్తి, మంచి భార్య, మంచి పిల్లలు, ఉన్నతమైన కుటుంబం అంతా ఉన్నప్పటికీ కూడా.. జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో తీరని ఒక కోరిక ఉండిపోయింది అంట. ఆ కోరిక అంటే ఆయనకు చాలా ఇష్టం అంట. కానీ అది జీవితంలో ఇంకా తీరే దారి లేదంట. ఎన్టీఆర్ కి అంత డబ్బు, కుటుంబం అన్ని ఉండగా తీరని కోరిక ఉండిపోయిందా ఏమిటబ్బా అని అనుకుంటున్నారా? ఉంది.. ఇంతకీ ఎన్టీఆర్ జీవితంలో అంత తీరని కోరిన మిగిలిపోయిన కోరిక ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.
జూనియర్ ఎన్టీఆర్ కి కూతురు అంటే చాలా ఇష్టం అంట. తన భార్య మొదటిసారి ప్రెగ్నెంట్ అయినప్పుడే నాకు కూతురు పుడుతుంది, కూతురు పుడుతుంది అని మురిసిపోయేవాడు అంట. కానీ కొడుకు పుట్టాడు. ఆ తర్వాత రెండవ సారైనా కూతురు పుడుతుంది అని చాలా ఆశపడ్డాడంట కానీ రెండవసారి కూడా కుడికే పుట్టాడు.. ఆడ పిల్ల ఇంట్లో కళ కళలాడుతూ తిరుగుతూ ఉంటే ఆ కలే వేరబ్బా అంటాడంట ఎన్టీఆర్కా. నీ కూతురు పుట్టలేదు మూడోసారైనా కూతుర్ని ట్రై చేద్దాం అనుకుంటే డాక్టర్.. లక్ష్మీ ప్రణతి ఆరోగ్య రీత్యా ఇంక పిల్లలని కనడం మంచిది కాదని చెప్పాడంట. దీంతో భార్య ఆరోగ్యం గురించి ఆలోచించి ఆ కోరికని వదిలేసాడంట.
ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటే.. ఇది చూసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో బాధపడుతున్నారు. మా హీరో కి అన్నీ ఇచ్చావుగా భగవంతుడా.. ఈ చిన్న కోరిక కూడా తీర్చాల్సిందిగా అని అనుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR wish not come true) చాలా ప్రతిష్టాత్మకంగా విభిన్నమైన పాత్ర లో చాలా అద్భుతంగా ప్రతి సీన్ లలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో దివంగత శ్రీ దేవి కూతురు జాన్వి కపూర్ డెబ్ల్యూ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ లో జంటతో ముందుకొచ్చి ఈ సినిమా ద్వారా ఎలాంటి సక్సెస్, ఎలాంటి కలెక్షన్స్, రికార్డుని, అవార్డ్స్ ని సాధిస్తారో చూడాలి..