
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంతవరకు అందుకొని ఎన్నో అవార్డ్స్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది. అలాంటి సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ( Jr NTR movie Devara reshoot details ) జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా రూపుదిద్దుకుంటున్న సినిమా దేవర. దేవర సినిమా గురించి నందమూరి అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ పై ఎంతో ఆసక్తికరంగా ఉన్నారు.
అక్టోబర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో జాన్వి కపూర్ మొదటిసారిగా తెలుగు సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి మనందరికి తెలిసిందే.ఇక ఈ సినిమా అప్డేట్స్ గురించి జాన్వీ కపూర్ కూడా ఎంతో ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్న సంగతి తెలుసు. ప్రతి ఇంటర్వ్యూలో ( Jr NTR movie Devara reshoot details ) ఆమె ఈ సినిమా చిత్రీకరణ విధానం ఎంతో బాగుందని, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొస్తుంది. అయితే కొరటాల శివ దర్శకత్వం అనగానే అందరిలో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. పరాజయం అనేది లేకుండా ఆయన సినిమా ప్రయాణం ఎంతో చక్కగా సాగింది. కానీ మెగాస్టార్ చిరంజీవితో కలిసి తీసిన సినిమా ఆచార్య తో ఆయన సక్సెస్ కి బ్రేక్ పడింది.
ఆ సినిమా ఫ్లాప్ అవడంతో సినీ అభిమానులు అందరూ ఆశ్చర్యపోయారు. కొరటాల శివ లాంటి దర్శకత్వంలో చిరంజీవి, ఆయన కొడుకు రామ్ చరణ్ కూడా నటించి తీసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అవడం అందరికీ నిరాశను కలిగించింది. అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ కెరీర్లో ఇచ్చిన సక్సెస్ మాత్రమే ( Jr NTR movie Devara reshoot details ) పరిగణలోకి తీసుకొని, దేవర సినిమాకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమా లాంటి సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివతో కలిసిచేయడం.. నిజంగా ఆయన నిర్ణయం ఒక డేరింగ్ స్టెప్ అని అనుకోవాలి. అలాంటిది ఇప్పుడు దేవర సినిమా రిలీజ్ సిద్ధంగా ఉండగా అందులో కొన్ని సీన్స్ చూసి ఎన్టీఆర్ సాటిస్ఫైడ్ అవ్వలేదని, దాన్ని మళ్ళీ రీషూట్ తీయడానికి కొరటాల శివ ఆలోచిస్తున్నారని వార్తలు బయటకు వస్తున్నాయి.
దీంతో ఎన్టీఆర్ అభిమానులు అందరూ నిరాశపడుతున్నారు. సినిమాలో కొన్ని సీన్స్ సాటిస్ఫాక్షన్ లేవు మళ్ళీ రి షూట్ అంటే సినిమా ఏమైనా దెబ్బ కొడుతుందా అని భయంతో ఉన్నారు. మరోపక్క కొందరు అయినా.. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత సినిమా అంటే ఆ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. అలాంటి క్రమంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పే అని అంటున్నారు. నిజానికి అసలు ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయంలో అంత తప్పు ఉందా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా దేవరా సినిమా రిలీజ్ అయ్యి దాని రిజల్ట్ చూసిన తర్వాతే.. ఎన్టీఆర్ నిర్ణయం గురించి మాట్లాడుకోవాలని మరికొందరు అనుకుంటున్నారు.