అందమే అసూయ పడుతుంది అనసూయ అందం ముందు
అందానికే అందం యాంకర్ అనసూయ అందం. ఈ మధ్య అనసూయ తన గ్లామర్ రోజు మరింత పనిచేస్తుంది, ఏజ్ పెరుగుతున్న కొద్ది తనలోని గ్లామర్, తన అందం మాత్రం ఏ మాత్రం తగ్గడం.
యాంకర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన అనసూయ చిన్న చిన్నగా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అంది పుచ్చుకొని అంచలంచలుగా సెలబ్రిటీ స్థాయికి చేరింది.
అటు వెండితెరపై ఇటు, బుల్లితెరపై తెగ చురుగ్గా ఉంటూ ఫుల్ బిజీబిజీగా తన లైఫ్ గడుపుతుంది. మరోపక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజు ఫోటోషూట్లు దిగుతూ కుర్రకారుకు సెగలు పుట్టిస్తుంది.
మన హైదరాబాద్ లో 1985లో మే 15న పుట్టింది ముద్దుగుమ్మ. ఇంటర్ చదువుకునే సమయంలో భర్త సుకాంక్ భరద్వాజ్ తనకు ప్రపోజ్ చేసాడు, అందరిలాగే అనసూయ కూడా అప్పుడే ఒప్పేసుకోకుండా ఒకటిన్నర సంవత్సరం వరకు తనతో స్నేహం చేసిన తర్వాత తన ప్రేమకు అంగీకరించింది.
ఆ తరువాత తొమ్మిది సంవత్సరాలు వీళ్ళు ప్రేమించుకుని 2010లో ఎలాగో అలా ఇద్దరి ఇళ్ళలో ఒప్పించి పెద్దలందరి సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు. వీళ్ళ ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు శౌర్య, ఆయాన్ పుట్టారు.
తన విద్యాబ్యాసానికి వస్తే 2008 లో భద్రుక కళాశాల నుండి MBA పట్టాపొందింది. ఎన్నో సినిమాల్లో వచ్చిన అవకాశాలు వదిలి సాక్షి టీవిలో వాఖ్యాతగా పనిచేసింది.
తర్వాత జజర్దస్స్ తన జీవితంలో ఓ పెద్ద మలుపు అనే చెప్పాలి, ఇందులోకి వచ్చాక యాంకర్ అంటే అందానికి ప్రతిరూపమైపోయింది అనసూయ తన మాటలతో కుర్రకారులను మాయ చేస్తూ తన వలలో పడేసుకుంది చాలా మంచి క్రేజ్ సంపాదించుకుంది.
హీరోయిన్లతో పోటీగా తన సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతూ యాంకర్స్ అంటే తక్కువ కాదని నిరూపించింది.
తన అంద చందాలను ఆరబోస్తూ తెలుగు ప్రజల్లో గూడు కట్టేసింది ఈ అమ్మడు, అప్పుడు ఎప్పుడో 18 ఏళ్ళ క్రిందట వచ్చిన నాగ సినిమాలో కనిపించిన అనసూయ మళ్ళీ ఆ తర్వాత సినిమా స్ర్టీన్ పై ఎప్పుడు కనిపించలేదు.
న్యూస్ ప్రజంటర్ గా మారింది ఆ తర్వాత జభర్దస్స్ లో యాంకర్ గా మారి అందరితో కనెక్ట్ అయిపోయింది. తను చీర కట్టు కట్టిందంటే చాలు సోషల్ మీడియాలో ఆ ఫోటోలు తెగ చెక్కర్లు కొట్టాల్సిందే, చీర కట్టులోని తన అందంతో అందరినీ మెస్మరైజ్ చేసేస్తుంది దీంతో అభిమానులు పండుగ చేసుకుంటూ తెగ షేర్లు కొడుతుంటారు ఫోటోలు.