Home Cinema Janhvi Kapoor : జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమా స్టోరీ అదిరిపోయే...

Janhvi Kapoor : జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమా స్టోరీ అదిరిపోయే సీన్స్ తో ఇదేనంట..

janhvi-kapoor-and-varun-dhawan-bawaal-movie-details

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది. ఇటు టాలీవుడ్ లో, అటు బాలీవుడ్ లో కూడా ఆమె పేరు గట్టిగానే వినిపిస్తుంది. ఇప్పుడు అందరి కళ్ళు జాన్వికపూర్ మీదే ఉన్నాయి. ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోయిన్ గా జాన్వికపూర్ ని చూస్తుంది సినిమా ఇండస్ట్రీ. ఇప్పటివరకు ఆమెకు ( Janhvi Kapoor and Varun Dhawan ) పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అనేవి పడలేదు గాని.. అయినా కూడా ఆమె బ్యాక్ గ్రౌండ్ను బట్టి ఆమెకు మంచి క్రేజీ ఉంది. అందుకే ఆమెను ఆఫర్లు అనేవి వదిలిపెట్టడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి చేస్తూనే బిజీగానే ఉంటుంది జాన్వీ కపూర్.

janhvi-kapoor-and-varun-dhawan-bawaal-movie-details

జాన్వి కపూర్ హీరోయిన్ గా, వరుణ్ ధావన్ హీరోగా కలిసి నటించిన సినిమా బవాల్. ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు ముందు ప్రయత్నించారు గాని.. తర్వాత ఏమనుకున్నారో ఏమో తెలియదు ఈ సినిమాని డైరెక్ట్ గా ఓటీడీలో రిలీజ్ చేస్తున్నారు.బవాల్ సినిమాకి దర్శకుడు నితీష్ తివారి. ఈ సినిమా షూటింగ్ అనేక దేశాల్లో ( Janhvi Kapoor and Varun Dhawan ) చేయడం జరిగింది. ముంబై, కాన్పూర్, లక్నో, పారిస్, బెర్లిన్, ఆమ్స్టర్డ్యామ్, క్రకోవ్, వార్సా, పోలాండ్ ఇలా అనేక ప్రదేశాల్లో ఎంతో ఖర్చు పెట్టి ఈ సినిమాని భారీగానే తీశారు. మరి జాన్వీ కపూర్ లాంటి హీరోయిన్ ని, వరుణ్ దావన్ లాంటి హీరోని పెట్టి సినిమా ధియేటర్లో రిలీజ్ చేయకుండా ఓటీటీ లో డైరెక్ట్ గా ఎందుకు రిలీజ్ చేశారు అనేది చాలామందికి అనుమానంగానే ఉంది.

See also  Chiranjeevi - Diwali : చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకలలో ఆ స్టార్ హీరోలో మరో కోణం చూసారు..

janhvi-kapoor-and-varun-dhawan-bawaal-movie-details

 

అయితే ఇటీవల చాలా సినిమాలు సినిమా హాల్స్ లో రిలీజ్ చేసి నష్టాన్ని భరించే కంటే.. ఓటీపీలో రిలీజ్ చేసుకుని సుఖంగా వాళ్ళ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎక్కువగానే ఉంటున్నారు. ఎందుకంటే సినిమా హాల్ కి వెళ్లడం అంటే.. అది ఏమైనా గ్రాఫిక్ పరంగాను లేదా హై బడ్జెట్ సినిమా అయితేనో కష్టపడి థియేటర్ కి వెళ్లి ( Janhvi Kapoor and Varun Dhawan ) చూస్తున్నారు గాని.. ఆడియన్స్ కూడా సుఖంగా ఇంట్లో ఓటీటీ లో చూడడానికే మామూలు సినిమాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆ క్రమంలోనే బవాల్ సినిమాను కూడా ఓటీటీ లో రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా జూలై 21వ తేదీ 2023న ఓటీటీ లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది.

See also  Actress Mrunal Thakur: పెళ్లి చేసుకున్న ఆ హీరోతో ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్. అతగాడిని తప్ప మరెవ్వరినీ చేసుకోదట.

janhvi-kapoor-and-varun-dhawan-bawaal-movie-details

ఇక ఈ సినిమా స్టోరీ కి వస్తే జాన్వి కపూర్ వరుణ్ ధావన్ ఇద్దరు కూడా పెళ్లయిన కొత్తజంట అంట. వీళ్ళిద్దరి మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ చాలానే ఉంటాయంట. అయితే కొత్తగా పెళ్లయిన వీళ్ళిద్దరి మనస్తత్వాలు కొన్ని చోట్ల కలవక కొన్ని గొడవలు చికాకులు వస్తూ ఉంటాయంట. అలా భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటే ఏం జరుగుతుంది? చివరికి ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాది? అనేదే ఈ కథ అంట. మరి ఈ సినిమాలో జాహ్నవి కపూర్ తన టాలెంట్ ని ఎలా చూపించకుంది? ఈ జంట ఆడియన్స్ ని ఎంతగా ఓటీటీ లో మెప్పిస్తుంది అనేది రిజల్ట్ రేపు చూడాలి. అలాగే జాన్వి కపూర్ ఇప్పుడు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.