
Jaggu Bhai: తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు హీరోగా చాలా చిత్రాలు నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతగానో చేరువయ్యాడు జగపతి బాబు. కానీ ఎందుకో తెలియదు కొద్ది రోజులపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు ఇక ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ న మొదలుపెట్టి నరసింహం నందమూరి బాలయ్య బాబు సూపర్ డూపర్ హిట్ చిత్రంలో విలన్ గా అడుగుపెట్టాడు. ప్రస్తుతం అందువచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విలన్ గా తండ్రిగా వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. ఇక జగ్గు భాయ్ ఇటీవలే ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం సాలార్ లో కీలకమైన పాత్ర పోషించాడు. .
ఇక ఇదే కాకుండా నిత్యం ఎంతగానో అలరిస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇక ఇదే కాకుండా తాజాగా జగపతిబాబు ట్విట్టర్ వేదికగా ఒక ఫోటో పెట్టాడు. ఆ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి లోనయి షాక్ అయ్యారు. ఆ పోస్ట్ కి ఒక క్యాప్షన్ కూడా రాశాడు అది చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేసింది. అది ఏంటంటే.
ఎలాగో అలా పుట్టేసాం సిగ్గు లేకుండా మీ అందరిని అడుగుతున్నా మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి.ఇక రెండవది క్షణం ఆలోచించకుండా త్వరగా మీరే డిసైడ్ చేయండి ఈ రెండిట్లో ఏది కొట్టమంటారు అంటూ రాసుకోచ్చాడు. ఇదే కాకుండా ఓ ఫుల్ బాటిల్ను ఒక చేతిలో పట్టుకొని మరొక చేతిలో పాల బాటిల్ని పట్టుకున్న ఫోటోలు షేర్ చేశాడు. రెండు కలిపి కొట్టండి అంటూ రకరకాల ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. ఇక మరికొందరైతే పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు (Jaggu Bhai ) జగపతి బాబు గారికి.