Allu Arjun: పాన్ ఇండియా సినిమా గా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ సినిమా పుష్ప తరువాత పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసినదే. ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. (Jabardasth Avinash getting threats from Allu Arjun fans what happened ) ఈ సినిమా పై సుకుమార్ ఎంత ప్రాణం పెట్టి తీస్తున్నాడో అర్ధమవుతుంది. ఒక పెద్ద స్టార్ హీరోని అమ్మవారి రూపంలో చూపించడం అంటే.. అలా ఆడియన్స్ ను మెప్పించగలను అనుకుంటున్నాడు అంటే.. కాన్సెప్ట్ మీద అతని పని తీరు మీద అతనికి ఉన్న నమ్మకం, భక్తి కనిపిస్తుంది.
అలాంటి పోస్టర్ తో కామెడీ చేసాడు జబర్దస్త్ అవినాష్. సాధారణంగా సెలబ్రెటీస్ మీద కామెడీ చెయ్యడం, మిమిక్రి చేయడం, ఇమిటేట్ చేయడం ఇలాంటివి చేయడం చాలా సహజం. వాటిని పెద్దగా పట్టించుకోరు. కని కొన్నిసార్లు కొన్నిటిని చాలా సున్నితంగా కొందరు చూస్తారు. అలాంటివి గమనిస్తూ ఏమైనా చెయ్యాలి తప్ప.. అన్నివేళలా ఒకేలా ఉంటాదని అనుకోకూడదు. జబర్దస్త్ షో తో అవినాష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరవాత అతనికి అనేక షో లలో చేసే అవకాశం వచ్చింది. అక్కడితో ఆగిపోకుండా.. సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
అయితే ఇటీవల రిలీజ్ చేసిన పుష్ప 2 పోస్టర్ ని అవినాష్ ఇమిటేట్ చేసాడు. అంతే అది చూసిన అల్లు అర్జున్ ఫాన్స్ ఒక రకంగా పట్టుకున్నారు. పుష్ప 2 లో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో రిలీజ్ చేసిన పోస్టర్ కి చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాంటి పోస్టర్ ని ఇమిటేట్ చేసాడు అవినాష్. (Jabardasth Avinash getting threats from Allu Arjun fans what happened ) దీనితో అల్లు అర్జున్ అభిమానులకు విపరీతమైన కోపం వచ్చిందట. మా హీరో అమ్మవారిలా ఉంటె.. నువ్వు డెవిల్ లా ఉన్నావు,వెంటనే ఇమేజ్ రిమూవ్ చెయ్యు అని వార్నింగ్ ఇచ్చారంట. నువ్వు గాని తియ్యకపోతే ఊరుకునేది లేదు అంటూ వార్ణింగ్ ఇచ్చారంట.
అయితె పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ స్థాయి ఇంకా పెరుగుతాదని ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. కాకపోతే ఈ సినిమా ట్రైలర్ లో రష్మిక కనిపించకపోవడం వలన ఆ పాత్రపై ఇంకా ఆశక్తి పెరిగింది. అసలు ఈ సినిమాలో అల్లు అర్జున్ మరియు రష్మిక కెమిస్ట్రీ ఎలా ఉండబోతాది? ఇంకా పుష్ప కోసం ప్రజలు పోరాడటం ఇవన్నీ చూస్తే.. సినిమా ఎంత తొందరగా వస్తాదా? చూద్దామా అని అభిమానులకు నిజంగా చాలా ఆత్రంగా ఉంది. ఇంత ఆనందంగా ఆ సినిమా కోసం ఎదురు చూస్తుంటే.. ఇలాంటి సమయంలో అవినాష్ అలా ఇమిటేట్ చేసి అల్లు అర్జున్ ని మాత్రమే కాదు.. ఆ అమ్మవారిని కూడా అవమానించాడని ఆగ్రహం చూపిస్తున్నారు. దానితో సోషల్ మీడియాలో అవినాష్ ని కామెంట్స్ తో అభిమానులు ఇరగబాదుతున్నారు..