Home Cinema Vishwak Sen: అప్పుడే ఇలాంటి నిర్ణయం తీసుకుని విశ్వక్ సేన్ ట్రాక్ తప్పుతున్నాడా.?

Vishwak Sen: అప్పుడే ఇలాంటి నిర్ణయం తీసుకుని విశ్వక్ సేన్ ట్రాక్ తప్పుతున్నాడా.?

Vishwak Sen Decision: అనది కాలంలోనే యంగ్ హీరో గా గుర్తింపు తెచ్చుకొని అలాగే డైరెక్టర్ గా కూడా కొనసాగుతూ ఉన్న విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకించి తెలియజేయాల్సిన అవసరం లేదు. తెలుగు వెండి తెర పై ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన ఈయన ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టు ఓ వార్త అయితే వైరల్ అవుతుంది. మరి ఆ విషయం ఏంటి అని తెలుసుకునే ముందు వివరాలలోకి వెళితే.. 100% పక్క తెలుగు ప్లాట్ఫారం గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆహాలో వర్సటైల్ హీరోగా విశ్వక్ సేన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియా మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి.

is-vishwak-sen-going-off-track-by-taking-such-a-decision

ఇప్పటికే ఆహా ప్లాట్ఫారం మన తెలుగు ప్రేక్షకులకు ఎంత చేరువైందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే.. ఇక ఈ ఓ టి టి వేదికలో.. వెబ్ సిరీస్ లు, స్పెషల్ టాక్ షోలు, రియాల్టీ షోలు, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఎంతగానో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది ఆహా.. ఇందులో భాగంగా మరొక విలక్షణమైన షో తో మన ముందుకి రావడానికి సర్వం సిద్ధం చేసుకుందట. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఎంతో మంది హీరోలతో మన అందరిని అలరించిన ఆహా ప్రస్తుతం విశ్వక్ సేన్ తో ప్రేక్షకులను పలకరించడానికి సర్వం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే విశ్వక్ సేన్ ఫలక్ నామా దాస్, ఓరి దేవుడా, దాస్ కా దమ్ కి, హిట్ వంటి చిత్రాలతో సినీ కెరియర్ ను ప్రారంభించిన విశ్వక్ తన దైన శైలిలో వైవిధ్యమైన విలక్షణ చిత్రాల లో నటిస్తూ ముందుకు సాగుతున్నాడు.

See also  Samantha: సమంత ఎక్కడికి వెళ్ళినా కళ్ళద్దాలు తీయ్యడమే లేదు ఎందుకు.? కారణం అదేనా.!!

is-vishwak-sen-going-off-track-by-taking-such-a-decision

హీరోగా ఎన్నో చిత్రాలు నటించి యంగ్ హీరో జాబితాలో చేరిన విశ్వక్ ప్రస్తుతం ఆహా వేదిక ద్వారా డిజిటల్ రంగంలోకి కూడా అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఇక విశ్వక్సేన్ ఇంత వరకు చూడని సరికొత్త అవతారంతో ఆహా వేదిక అతడిని పరిచయం చేయబోతుందట. ఇక ఆహా చెప్పిన దాని ప్రకారం.. మంచి విందు భోజనం లాంటి 15 ఎపిసోడ్లకు సర్వం సిద్ధం చేసిందట. ఇక దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడబోతున్నట్టు సమాచారం.. కానీ విశ్వక్ సేన అభిమానులు ప్రస్తుతం ఆయన వరుస చిత్రాలతో మంచి ఊపు మీద ఉండి చాలా మంచి చిత్రాలలో అవకాశాలు వస్తున్న వేళ సినిమాలపై దృష్టి పెట్టకుండా ఇలా చేయడం ఏంటి అని ఆందోళన చెందుతున్నారు అభిమానులు.

See also  Jailer Rajinikanth : ఇదేందిరా అయ్యా.. జైలర్ ఇలాంటి రికార్డ్ క్రీయేట్ చేసింది!

is-vishwak-sen-going-off-track-by-taking-such-a-decision

ఇక ఇదే విషయంపై చర్చించుకుంటున్న విశ్వక్ సేన అభిమానులు ఇలాంటి షోలు చేయడం వల్ల ఆయన కెరీర్ పై ఏమన్నా ప్రభావం పడుతుందో అని నెట్టింట విశ్వక్ సేన (Vishwak Sen Decision) అభిమానులు ఆందోళనతో చర్చ కొనసాగిస్తూ ఆలోచిస్తున్నారట.. ఇదే ప్లాట్ఫారం ఆహాలో ఏకంగా నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఏకంగా రెండు సీజన్లకు గాను హోస్ట్ గా వ్యవహరించి ఆకట్టుకున్న సంగతి మనందరికీ తెలుసు.. మరి విశ్వక్ కూడా ఇలా ఎంట్రీ ఇచ్చి మంచిగా సక్సెస్ అవుతాడా అనేది లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.