Home Cinema Pooja Hegde: ఓహో ఇదా అసలు కథ.! అందుకేనా ఇన్ని రోజులు సినిమాలు చెయ్యకుండా దూరంగా...

Pooja Hegde: ఓహో ఇదా అసలు కథ.! అందుకేనా ఇన్ని రోజులు సినిమాలు చెయ్యకుండా దూరంగా ఉంటుంది పూజా హెగ్డే..

Pooja Hegde Movies: తెలుగు చిత్ర పరిశ్రమలో నటించక ముందుకే తమిళంలో జీవ సరసన మాస్క్ అనే చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ పూజా హెగ్డే. అయితే.. తెలుగులో మాత్రం అక్కినేని నాగచైతన్య సరసన ఒక లైలా కోసం అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి మన తెలుగు చలనచిత్ర రంగంలో అడుగు పెట్టింది. తను నటించిన తొలి చిత్రం మంచి హిట్ అందు కోవడంతో ఆ తర్వాత ఇంకేముంది వరుసగా అవకాశాలు మన తెలుగు చిత్ర పరిశ్రమలో క్యూ లు కట్టాయి. అయితే తమిళ్ లో జీవా సలసన మాస్క్ అనే చిత్రంలో నటించింది పూజా హెగ్డే. కాగా ఆ చిత్రం తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి విడుదలవుగా.. అంతగా హిట్ మాత్రం అందుకోలేదు. అక్కినేని నాగ చైతన్య తో నటించిన ఒక లైలా కోసం చిత్రం తో ఈ అమ్మడుకి స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు క్యూ కట్ట సాగాయి.

is-this-the-reason-pooja-hegde-is-away-from-movies

అలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది పూజా హెగ్డే. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటించిన దువ్వాడ జగన్నాథమ్ – డీజే చిత్రంలో బిగినీతో కనిపించి అందరిని షాక్ కు గురిచేసింది. కుర్ర కారులు సైతం అమ్మడి అందానికి పరవశించిపోయారు. దాంతో అతి తక్కువ సమయంలో తెలుగులో క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మూట కట్టుకుంది పూజా హెగ్డే.. అయితే మొన్నటి వరకు కూడా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోయిన పూజా హెగ్డే ప్రస్తుతం ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని చెప్పాలి. ఇక తన తొలి చిత్రం సూపర్ హిట్ అవడంతో ఆ చిత్రం అనంతరం బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకోవడం.. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ్ మరియు హిందీ ఇండస్ట్రీలలో కూడా వరుసగా సినిమాలు చేయ సాగింది పూజ హెగ్డే అలా అవకాశాలు క్యూ లు కట్టాయి.

See also  Prabhas : ప్రభాస్ పెళ్లి గురించి ఊహించని వార్త వెలుగులోకి!

అలా మొదట్లో ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. తను ఏ చిత్రంలో నటిస్తే ఆ చిత్రం సూపర్ హిట్గా నిలిచేది. కానీ ఇటీవలి కాలంలో ఈ మధ్య ఏమైందో తెలియడం లేదు ఈ అమ్మడు వరుసగా ఫ్లాప్స్ అందుకుంటుంది. ఏ చిత్రంలో (Pooja Hegde Movies) నటించిన అది ఫ్లాప్ గానే మిగిలిపోతుంది. తమిళ్ లో విజయ్ సరసన బీస్ట్.. తెలుగులో ప్రభాస్ సరసన రాధే శ్యామ్.. హిందీలో సల్మాన్ ఖాన్ సరసన నటించిన కిసికి భాయ్ కిసికి జాన్ వంటి చిత్రాలు ఎంతగానో నిరాశ పరిచాయి. దాంతో ఈ అమ్మడి గోల్డెన్ లెగ్ పేరు కాస్త పోయి ఐరన్ లెగ్  ముద్రపడిపోయింది. అయితే ఈ అమ్మడు తదుపరి తన చిత్రాలు ప్రిన్స్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోయిన్ గా ఎంపికైంది. కానీ ఏమైందో తెలియదు అనూహ్యంగా ఈ చిత్రాల నుండి తప్పుకుంది.

See also  Samantha : సూసైడ్ చేసుకోవాల్సిన ఆ పరిస్థితుల్లో సమంతకు అండగా నిలించింది వాళ్ళా!

is-this-the-reason-pooja-hegde-is-away-from-movies

ఇంత పెద్ద స్టార్ హీరోల చిత్రాలు నుండి తప్పుకోవడంతో ప్రతి ఒక్కరిలో చర్చ మొదలైంది. అసలు ఏమైంది పూజా హెగ్డే కు అని. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం చిత్రంలో మొదటగా హీరోయిన్ ని పూజా హెగ్డే అనుకున్నారట. కానీ తను తప్పడంతో శ్రీ లీలను ఫిక్స్ చేశారు. హరిష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా చేయాల్సి ఉంది. కానీ ఆ చిత్రంలో నుండి కూడా ఆమె అవకాశాన్ని కాదనుకుంది కాగా ఆ అవకాశం కూడా శ్రీ లీలకు దక్కింది. అయితే అసలు కారణం ఏంటని అందరూ అనుకుంటుండగా.. ఎందుకు ఏ చిత్రానికి కూడా కమిట్ కావడం లేదట అయితే పూజ సినిమాలకు దూరంగా ఉండడానికి అసలు సిసలైన కారణం తెలిసింది. ఆమె కాలికి సర్జరీ అయినందున ఆ గాయం మరింత ఎక్కువ అవ్వడంతోనే సినిమాలకు దూరంగా ఉందని తెలుస్తుంది. కాగా గతంలో పూజా హెగ్డే కాలికి దెబ్బ తగిలిన విషయం మనందరికీ తెలుసు. అందుకోసమే సర్జరీ చేయించుకుంది. ఆ కారణం చేతనే సినిమాలకు దూరంగా ఉంటుందని మనకు అర్థమవుతుంది.