
Anushka Shetty: తెలుగు చిత్ర పరిశ్రమలోకి అక్కినేని నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి తను ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత తన అందంతో, తన నటనతో తెలుగులో రాణిస్తూ కోట్లాది మంది ప్రేక్షకులను తన సొంతం చేసుకుంది అనుష్క శెట్టి. అలాంటి అనుష్క అంటే తెలియని తెలుగు ప్రజలు, సిని ప్రియులు ఉండనే ఉండరు. ఇక అనుష్క తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన జత కట్టిన ఈ అమ్మడు..(Anushka Shetty In Love)
కేవలం హీరోల సరసన హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో సైతం నటించి అందరినీ మెప్పించింది. అరుంధతి, పంచాక్షరి, భాగమతి, నిశ్శబ్దం మొదలైనటువంటి చిత్రాల్లో నటించి లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిపోయింది అనుష్క శెట్టి. ఇక ఇలాంటి ముద్దుగుమ్మ అనుష్కకు అరుంధతి సినిమాతో ఎక్కడ లేని క్రేజ్ అంతా తనకే వచ్చి పడిందని చెప్పాలి. అయితే గత కొద్ది కాలంగా అనుష్క ప్రభాస్ మధ్య లవ్ ఉందంటూ వీళ్ళిద్దరూ.. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారంటూ..
త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు అంటూ.. ఎన్నో రకాల వార్తలు ఎన్నో ఏళ్లుగా సాగాయి. కానీ ఈ విషయంలో ఇప్పటి వరకు ఇటు ప్రభాస్ కాని అట అనుష్క గాని స్పందించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఎప్పుడు వీరి ప్రేమ గురించి ఎక్కడ ఎవరు అడిగినప్పటికీ వీళ్ళు స్పందించిన మేము జస్ట్ ఫ్రెండ్స్ అని తప్ప మా మధ్యలో ఏదీ లేదని తప్ప మరే విధమైన విషయం చెప్పకుండా అసలు విషయానికి కప్పి పెడుతూ వస్తున్నారు.. కాగా ఇటీవల అనుష్క శెట్టి ప్రేమించిన ఆ ఏకైక వ్యక్తి ప్రభాస్ మాత్రం కాదని మరి ఆయన ఎవరో కాదు.. ఆ వ్యక్తి ఇతనే అంటూ ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
మరి ఇంతకీ అనుష్క అంతగా ఇష్టపడ్డ ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్య పోవాల్సిందే.. కానీ ఆయన మాత్రం హీరో కాదు.. ఆయన ఓ స్టార్ క్రికెటర్.. గతంలో స్టార్ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న రాహుల్ ద్రావిడ్ (Anushka Shetty In Love) అంటే అనుష్కకి ఎంతో ఇష్టం అంట.. ఆయనను చాలా పిచ్చిపిచ్చిగా ఇష్టపడేదట.. ఎందుకంటే అనుష్కకి చిన్నతనం నుంచి రాహుల్ ద్రావిడ అంటే ఎనలేని ప్రీతి మక్కువ అంట.. ఈ విషయాన్ని స్వయంగా అనుష్క ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తానే తెలిపింది. అనుష్కకి ఇష్టమైన వ్యక్తి అంటే అందరూ ప్రభాస్ అని భావిస్తుంటారు. కానీ అసలు విషయం తెలిశాక చాలామంది ప్రభాస్ కాదా అని కామెంట్లు పెడుతున్నారు. దాంతో ఈ వార్త మరొక్కసారి వైరల్ గా మారింది.