Pawan Kalyan – Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే యూత్ కి ఎంత ఇష్టమో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ అంటే యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే అల్లు అర్జున్ ఎప్పుడూ కూడా తన సినీ కెరీర్ గురించి ( Pawan Kalyan and Allu Arjun political ) చూసుకుంటూ వెళ్తాడు తప్పా.. ఎటువంటి పాలిటిక్స్ లోకి తాను ఎప్పుడూ వెళ్ళలేదు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కొంత సపోర్టుగా తిరిగాడు తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పెట్టిన తర్వాత ఎప్పుడు ఎక్కడ కూడా ఎక్కువగా రాజకీయాల్లో తిరగడం గాని.. దానికి సపోర్టుగా ప్రచారాల్లో పాల్గొనడం గానీ ఆయన చేయలేదు. అలాగని యాంటీగా కూడా ఎప్పుడూ లేడు.. మౌనంగానే ఎప్పుడు ఎక్కువగా కనిపించాడు.
అలాంటి అల్లు అర్జున్ ఇప్పుడు మొదటిసారిగా తన మామ కోసం ప్రచారంలోకి వెళ్తాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన మామ అంటే పవన్ కళ్యాణ్ కాదు.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి. ఆయన బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. ఆయనకు ( Pawan Kalyan and Allu Arjun political ) బీఆర్ఎస్ లో ఈసారి తప్పకుండా ఎమ్మెల్యే సీటు వస్తుందని.. ఆయన ఎన్నికల్లో గట్టిగా పాల్గొనబోతున్నారని.. దాని నిమిత్తం అల్లు అర్జున్ ప్రచారానికి తిరుగుతాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. ఈ వార్తలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. అయితే మెగా ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా..
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో బిజెపికి సపోర్ట్ ఇవ్వడం ఇంతకుముందు జరిగింది. ఇప్పుడు కూడా బిజెపితో ఆయన సన్నిహితంగానే ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణలో బిజెపికి వ్యతిరేకమైన పార్టీ బిఆర్ఎస్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan and Allu Arjun political ) సపోర్ట్ గా ఉన్న పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణ రాజకీయాల్లో అల్లు అర్జున్ బిఆర్ఎస్ కి సపోర్ట్ ఇవ్వడం జరిగితే.. అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ కి కూడా వ్యతిరేకి అవుతాడని ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఒకసారి ” చెప్పను బ్రదర్ ” అని పవన్ అభిమానులకు వ్యతిరేకంగా అల్లు అర్జున్ అన్నమాట.. చాలా కాలం అది అనేక ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకమైన పార్టీతో ముడిపడి ప్రచారానికి తిరిగితే.. పవన్ అభిమానులు హర్ట్ అయ్యే అవకాశం ఉందేమో అని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేరువేరు రాష్ట్రాల అయినప్పటికీ.. వీటి రాజకీయాల మధ్య చాలా సున్నితమైన సన్నిహిత బంధం ఉన్నట్టే. ఎందుకంటే రెండూ తెలుగు రాష్ట్రాలే అవ్వడం వలన.. రెండు ప్రాంతాల్లో హీరోలకి అభిమానులు క్రేజ్ ఒకేలా ఉండటం వలన వాళ్ళు ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ వైపు ఆ హీరో ఫ్యాన్స్ మగ్గు చూపే అవకాశం ఉంటుంది. అయితే రాజకీయాలకు దూరంగా ఉండే అల్లు అర్జున్ నిజంగా మరి బిఆర్ఎస్ తరఫున.. వాళ్ళ మామ గురించి ప్రచారంలోకి తిరిగే టర్న్ తీసుకుంటాడా లేదా అనేది అఫీషియల్ గా తెలిసిన తర్వాతే నిర్ధారణ అవుతుంది.