Home Cinema Upasana-Samantha: ఆ విషయం లో ఉపాసన ఎవ్వరికీ తెలియకుండా సమంత కు ఇంట సహాయం చేసిందా.....

Upasana-Samantha: ఆ విషయం లో ఉపాసన ఎవ్వరికీ తెలియకుండా సమంత కు ఇంట సహాయం చేసిందా.. సీక్రెట్ మ్యాటర్..

Upasana Help: తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అటువంటి సమంత గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. ఇక అక్కినేని కుటుంబానికి కోడలు అయిన తర్వాత ఇండస్ట్రీలో మరింత ఎత్తుకు ఎదుగుతూ మంచి పేరు తెచ్చుకున్నది. సమంత విడాకుల అనంతరం పాన్ ఇండియా స్థాయిలో పాపులాటి దక్కించుకుంది సమంత. కాగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులని మైమరపించిన సమంత అనుకోకుండా పలు కారణాల వల్ల డిప్రెషన్ లోకి వెళ్లిన తర్వాత మయో సైటిస్ అనే వ్యాధి బారిన పడింది.
ఇక ఈ వ్యాధి నుంచి కోలుకున్న కొద్ది రోజులకి తను కమిట్మెంట్ అయినా పలు చిత్రాలను పూర్తి చేసుకున్నప్పటికీ..

Samantha Upasana 1

మళ్లీ ఆ వ్యాధి పూర్తి గా కోలుకోవడానికి ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే.. అయితే ప్రస్తుతం ఆమె వ్యాధి గురించి మనకి ఒక వార్త అయితే తెలిసింది. అదేంటంటే మయో సైటీస్ సమంతకి దరిచేరినప్పుడు ఉపాసన సమంతకి ఎవరు చేయలేని ఓ అతి పెద్ద సహాయం చేసిందట. మరి ఈ విషయం గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం.. మెగా కోడలు ఉపాసన సమంతకి అంత సహాయం చేయడానికి వీళ్ళిద్దరి మధ్య అంత స్నేహం ఉందా అనేది ముందు మనం ఇప్పుడు తెలుసుకుందాం.. కాగా గత కొద్ది రోజులుగా మయో సైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పటికే పలు రకాల ట్రీట్మెంట్లు తీసుకుంది.

See also  Bubblegum Teaser Review : రోషన్ రొమాన్స్ పై రాజీవ్ సుమల రియాక్షన్.. ఆ సీన్ లో డైలాగ్ వైరల్..

Samantha Myositis

ఇక ఆ తర్వాత ఆయుర్వేదంతో పాటు విదేశాలలో పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర కూడా ఈమె ఈ వ్యాధికి సంబంధించిన టెస్టులు చేయించుకుని చికిత్స కూడా తీసుకుంది. కానీ అయినప్పటికీ పూర్తిగా వ్యాధి నుంచి బయటపడినట్లు మనకి కనిపించడం లేదు. అయితే ఒకానొక సమయంలో సమంత గుర్తుపట్టలేనంతగా తన ఫేస్ చాలా దారుణంగా మారిపోయింది. ఆమె ముఖం మొత్తం నీరసంగా కనిపించి ఫేస్ లో ఉన్న ఆమె చరిష్మా గ్లో మొత్తం పూర్తిగా పోయింది. ఇక ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఆ మహమ్మారి నుండి పూర్తిగా కోలుకోవడానికి ప్రయత్నం చేస్తుంది సమంత. ఇక ఈ విషయం ఇలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమంతకి మయో సైటిస్ వ్యాధి దరిచేరిన కొత్తలో ఉపాసన దగ్గరికి వెళ్లి ఈ విషయం గురించి తెలిపాడట.

See also  Salaar Release Trailer: సలార్ రిలీజ్ ట్రైలర్ చూసి అంచనాలు ఇలా వేస్తున్న ఆడియన్స్..

Samantha

దాంతో ఉపాసన చూస్తూ ఊరుకోకుండా తన తాతయ్యకు తెలిసిన విదేశాలలో ఉండే పెద్ద పెద్ద డాక్టర్ల స్పెషలిస్టులని రికమండ్ చేసి సమంతనే వాళ్ళ దగ్గరికి పంపించిందట. మనందరికీ తెలిసిందే.. ఉపాసన (Upasana Help) అపోలో సీఈవో.. ఆమెకి మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ కచ్చితంగా తెలిసే ఉంటారు. అలా తనకు తెలిసిన ఫేమస్ డాక్టర్ల అందరిని సమంత దగ్గరికి పంపించి ఆమె కాస్త మయో సైటిస్ వ్యాధి నుండి కోలుకోవడానికి తన వంతు భాగంగా ఈ సహాయం చేసింది.. కాగా ఉపాసన సమంతకు మయోసైటిస్ వ్యాధిలో సహాయం చేయడంలో అతి పెద్ద కీలక పాత్ర వహించింది అన్న విషయం ఇటు రామ్ చరణ్ అభిమానులకే కానీ అటు సమంతా అభిమానులకే గాని చాలామందికి తెలియని విషయం ఇది.