Home Cinema Manchu Manoj: ఈ ఫోటోలో ఉన్న బాబు చెయ్యి ఎవరో తెలుసా.?? మంచు మనోజ్ కి...

Manchu Manoj: ఈ ఫోటోలో ఉన్న బాబు చెయ్యి ఎవరో తెలుసా.?? మంచు మనోజ్ కి ప్రాణం కన్నా మిన్న..!!

Who Is This Kid: ప్రస్తుతం మనందరికీ తెలిసిన విషయమే ఒకపక్క సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మరొక పక్క న్యూస్ లో కూడా తెగ చక్రాలు కొడుతున్న విషయం మంచు మనోజ్ రెండవ వివాహం. దివంగత నేత అయినటువంటి భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె భూమా మౌనిక రెడ్డిని రెండవ పెళ్లి చేసుకున్నటువంటి మంచి మనోజ్ వివాహానికి సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరి వివాహానికి సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో మంచు మనోజ్ షేర్ చేసుకోవడం జరిగింది.

in-manchu-manoj-wedding-pics-who-is-this-kid

దాంతో ఈ ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. శుక్రవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఫిలింనగర్ లో గల తన సోదరి మంచు లక్ష్మి గృహమునందు అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ వేడుకకు అత్యంత దగ్గర బంధువులు, సన్నిహితులు నడుమ ఈ వేడుక జరిగింది. ఈ క్రమంలో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కాగా వీటన్నిటికంటే మంచి మనోజ్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఒక ఫోటో హాట్ టాపిక్ గా మారి మరింత వైరల్ గా అయ్యింది.

See also  Pawan Kalyan - Sai Dharam Tej : పవన్ కళ్యాణ్ ని అనుమానిస్తున్న సాయిధర్మ్ తేజ్.. చివరికి ఎవరికి నష్టం?

in-manchu-manoj-wedding-pics-who-is-this-kid

ఆ ఫోటో (Who Is This Kid) ఏంటంటే భూమా మౌనిక రెడ్డి చేయి పట్టుకొని మరొక బాబు ఆ చేయి పోయిన పట్టుకున్నట్టు ఉన్న ఈ ఫోటో తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ దైవసాక్షిగా.. వేద పండితుల సాక్షిగా.. బంధుమిత్రుల సాక్షిగా.. భూమా మౌనిక రెడ్డి నాదే అన్నట్టుగా ఉండే ఆ ఫోటో ను ఇది శివుని ఆజ్ఞ అంటూ అర్దం వచ్చేలా మంచు మనోజ్ ఫోటోను షేర్ చేశాడు. ఐతే ఈ ఫోటో లో మంచు మనోజ్ అలాగే భూమా మౌనిక చెయ్యి కాకుండా మరొక చెయ్యి కూడా ఉంది. మరి ఆ బాబు ఎవరా అని ప్రతి ఒక్కరూ సెర్చ్ చెయ్యడం మొదలెట్టారు. ఇక ఇండస్ట్రీ లో ఐతే జోరుగా చర్చలు మొదలయ్యాయి.

See also  Ileana: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా. వైరల్ అవుతున్న ఫొటో..

in-manchu-manoj-wedding-pics-who-is-this-kid

ఐతే ఆ ఫోటో ఎవరు అనే దానికి మనకు సమాధానం లభించింది. ఇక మంచు మనోజ్ కి ఇది రెండవ వెళ్లి అలాగే భూమా మౌనిక రెడ్డి కి కూడా ఇది రెండవ వివాహమే.. కాగా మంచు మనోజ్ మొదటి భార్య ప్రణతి రెడ్డి తో మనోజ్ కి పిల్లలు లేరు. కానీ భూమా మౌనిక రెడ్డి కి మాత్రం తన మొదటి భర్త తో ఓ కొడుకు ఉన్నాడు. ఆ బాబు చెయ్యే ఇది. మౌనిక రెడ్డికి తన కొడుకంటే చాలా ఇష్టం. ఇక ఆ బాబు కూడా మా బాబు నే అంటూ ఇలా చెయ్యి పట్టుకుని చాలా ఎక్కువగా కేరింగ్ తీసుకుంటానంటూ ఆ శివుని సాక్షిగా ఒట్టు వేస్తున్నామంటూ చేసారట. ఈ క్రమంలోనే తన కొత్త జీవితానికి ప్రారంభించడంలో బాబు ఉంటే తన జీవితంలో తిరుగుండదని, విజయవంతంగా ముందుకు వెళుతుందని అన్న అర్ధం వచ్చేలా శివుడి ఆజ్ఞ అంటూ పోస్ట్ పెట్టాడని నెటీజన్స్ తన అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. దాంతో పెళ్ళయ్యి ఐదు రోజులు దాటుతున్నప్పటికీ వీళ్ళ వివాహనికి సంబంధించిన ఫోటోలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి.