Home Cinema Balagam – Virupaksha : బలగం విరూపాక్షలో వాళ్లిద్దరూ ఆ ఒక్కదాన్నే నమ్ముకుని కోట్ల డబ్బు...

Balagam – Virupaksha : బలగం విరూపాక్షలో వాళ్లిద్దరూ ఆ ఒక్కదాన్నే నమ్ముకుని కోట్ల డబ్బు రాబట్టారు.. ట్రై చేస్తే పోలా?

in-balagam-and-virupaksha-both-of-them-believed-in-that-one-thing-and-earned-crores-of-money

Balagam – Virupaksha : సినిమా ఇండస్ట్రీ అంటే ఎంత క్రేజ్ ఉంటాదో.. అంత రిస్క్ కూడా ఉంటాది. ఒక సినిమా హిట్ అయితే దాని నిర్మాతకు మాత్రమే కాదు.. ఆ సినిమాలో నటీనటులకు, టెక్నీషన్స్ కు, సినిమాని కొనుక్కున్నవారికి అందరికీ ఉపయోగమే. అలాగే సినిమా పొతే అందరికీ ఎవరి స్థాయిని బట్టి వారికి నష్టమే. అందుకే సినిమా ( Balagam and Virupaksha ) వాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. పూజలు అవి బాగా చేస్తారు. అలాగే, జ్యోతిష్యాన్ని, ముహూర్తలని, జాతకాలని అన్నిటిని బాగా నమ్ముతారు. ఎందుకంటే పాపం ఒక్కొక్క సినిమా కొన్ని కోట్లు ఖర్చు చేసి తీస్తే.. అది బాలేదు అనే టాక్ వస్తే చాలు ఆ నెక్స్ట్ షో నుంచి కలెక్షన్ ఉండవు.

in-balagam-and-virupaksha-both-of-them-believed-in-that-one-thing-and-earned-crores-of-money

అలా సినిమా ఫ్లాప్ అయితే, ఆ సినిమా టీం లో ఉన్నవారందరూ ఏదో రకంగా సఫర్ అవ్వక తప్పదు. ఇటీవల రిలీజ్ అయిన సినిమాలో బలగం సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా చాలా చిన్న బడ్జెట్ తో ఒక చిన్న గ్రామాన్ని అందులో ఒక కుటుంబాన్ని బేస్ చేసుకుని తీసిన సినిమా. అతి తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకి కొన్ని కోట్లు రాబడి దక్కింది. యావత్ ( Balagam and Virupaksha )తెలుగువారి మన్ననని పొందింది. వేణు మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊహించని స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సినిమా రిలీజ్ అయ్యి 50 రోజులు దాటినప్పటికీ ఈ సినిమా పై క్రేజ్ ఇంకా పోలేదు.

See also  Rajamouli - Prabhas : మళ్ళీ రాజమౌళి మరియు ప్రభాస్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా..

in-balagam-and-virupaksha-both-of-them-believed-in-that-one-thing-and-earned-crores-of-money

అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన విరూపాక్ష సినిమాకి కూడా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా సాయిధర్మతేజ్ యాక్సిడెంట్ తరవాత నటించిన సినిమా. ఈ సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఎక్కువగా పాజిటివ్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ అదరగొడుతుంది. త్రిల్లర్ సినిమాగా రూపొందిన ఈ సినిమా లో మూల కథ మొదటనే ( Balagam and Virupaksha ) రివీల్ చేసినా కూడా సినిమాలో ఎదో ఒక సస్పెన్సు చూపిస్తూ ఆడియన్స్ ని అలరించడంలో ఈ సినిమాని పొగిడి తీరాల్సి వస్తుంది. 23 కోట్ల టార్గెట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన విరూపాక్ష రెండు రోజుల్లో 24 కోట్ల గ్రాస్ వస్తూళ్లను తెచ్చుకుంది.

See also  Mahesh Babu : మహేష్ బాబు సూపర్ స్టార్ అయినా కూడా ఆ హ్యాబిట్ వదలలేకపోవడంతో చివరికి నమ్రత ఎం చేసిందంటే..

in-balagam-and-virupaksha-both-of-them-believed-in-that-one-thing-and-earned-crores-of-money

బలగం దర్శకుడు వేణు, విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఇద్దరూ నల్ల కాకులను నమ్ముకుని ఇన్ని కోట్లు సంపాదించారు. బలగం సినిమా మొత్తం ఒక కాకి వచ్చి పిండం తినలేదు అనే కాన్సెప్ట్ మీదనే నడుస్తాది. అలాగే విరూపాక్ష లో కూడా ప్రతీ ముఖ్యమైన సీన్ కి ముందు చూపించేది కాకినే.. ఇలా ఈ దర్శకులు ఇద్దరూ కాకిని నమ్ముకుని కొన్ని కోట్లు సంపాదించారు. ఇక మీదట మన తెలుగు సినిమాలు కొన్ని రోజులు పాటు అందరూ ఈ సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకుని కాకిని ఖచ్చితంగా పెడతారేమో. త్రిష సినిమా వర్షం హిట్ అయ్యిందని.. త్రిషా ఏ సినిమాలో నటించిన ఎంట్రెన్స్ కొంతకాలం వర్షం పెట్టేవారు. ఆలా ఇప్పుడు కాకిని పెడతారేమో. ఒకవేళ అలా సెంటిమెంట్ గా పెట్టినా తప్పులేదు. ఎందుకంటే అదృష్టం కలిసి వస్తాడంటే ఒక సారి ట్రై చేస్తే పోలా?

See also  SreeLeela: అందరి ముందు శ్రీలీల పరువు మొత్తం తీసేసిన హైపర్ ఆది..