Home Cinema Ileana: ఆ తప్పు వల్లే సౌత్ ఇండస్ట్రీ ఇలియానా ను బ్యాన్ చేసిందా..??

Ileana: ఆ తప్పు వల్లే సౌత్ ఇండస్ట్రీ ఇలియానా ను బ్యాన్ చేసిందా..??

Ileana: దేవదాసు సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమై ఫస్ట్ సినిమాతోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుంది గోవా బ్యూటీ ఇలియానా. ఆ తర్వాత వరుసగా పెద్ద హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి అతి తక్కువ సమయంలో చేరింది. అలా తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ సౌత్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని నార్త్లో కూడా తన సత్తా చాటుకుంది.
ఇదిలా ఉంటే గత కొద్ది సంవత్సరాలుగా ఇలియానా సౌత్ ఇండస్ర్టీలో కనుమరుగయ్యింది.

See also  Upasana : ఉపాసన డెలివరీ ఖర్చు ఎంత అయిందో ఎవరు పెట్టుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ileana got banned from south film industry because of that reason

దాంతో సౌత్ ఇండస్ర్టీలో తనను బ్యాన్ చేసారనే వాదనలు వినిపించాయి. అవును అది నిజమే. నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ గారు దానికి గల కారణాలు వెల్లడించారు. ఇలియానా ఓ తమిళ సినిమాలో హీరోయిన్ గా చేస్తానని 40 లక్షలు అడ్వాన్స్ తీసుకుంది ఆ తర్వాత షూటింగ్లో పాల్గొనకుండా మొహం చాటేసింది. ఇక ఆమె షూటింగ్ కి రాకపోవడంతో ఆమె స్థానంలో వేరే హీరోయిన్ పెట్టి సినిమా పూర్తి చేశారు దర్శకనిర్మాతలు.

See also  Chiranjeevi : చిరు మూడవ తరంలో ఇంతవరకు మగబిడ్డ పుట్టకపోవడానికి అసలు కారణం అదా?

ileana got banned from south film industry because of that reason

 

కానీ సినిమా ప్రొడ్యూసర్ ఆ 40 లక్షలు తిరిగి ఇవ్వమని అడిగినా ఇవ్వలేదు. దాంతో నడిగర్ సంఘం, సౌత్ ప్రొడ్యూసర్ల మండలికి నిర్మాత నటరాజన్ ఫిర్యాదు చేశారు. ఆ పైసలు ఎందుకివ్వడం లేదని నిర్మాతల సంఘం ఆదేశిస్తే ఇలియానా స్పందించకపోగా ఆమె మేనేజర్ వచ్చి కావాలంటే మరొక సినిమాలో నటిస్తుందేమో గానీ డబ్బులు మాత్రం ఇచ్చేదే లేదని చెప్పాడంట దీంతో ఆ మాటలకు హర్ట్ అయిన నిర్మాత మండలి ఇలియానాను సౌత్ మొత్తంలో బ్యాన్ చేశారు.

See also  The star hero heroines: సినీ ఇండస్ట్రీలో ఆ స్టార్ హీరో హీరోయిన్లు కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.. ఎవరో తెలుసా?

అందువల్లే ఆమె సౌత్ లో నటించడం లేదు కొంతమంది దర్శక నిర్మాతలు ఆమెను హీరోయిన్ గా పెట్టి సినిమా తీయాలని ఆమె బ్యాన్ ను ఎత్తివేయాలన్నారట. ఐతే ఇలియానా ఎగ్గొట్టిన డబ్బులు కట్టి ఆమెతో సినిమా తీసుకోండని చెప్పారట ఆ పైసలు కట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో సౌత్ ఇండస్ర్టీలో ఇలియానా బ్యాన్ అయ్యింది.