మీ చర్మం అందంగా మెరవాలంటే ఈ జ్యూసులు తప్పక తాగండి.
చాలామంది చర్మం నిగారింపు కోసం ఎన్నో రకాల మెడిసిన్లు, క్రీమ్స్ వాడుతుంటారు. అలాంటి వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి దాని తర్వాత విపరీతమైన పర్యవసానాలు ఉంటాయి. అందరికీ మెడిసిన్ పడదు అని కాదు కొందరికి పడితే కొందరికి పడదు. మరి చర్మాన్ని సహజ పద్ధతిలో నిగారింపు తెచ్చుకోవడం ఎలా తెలుసుకుందాం.
Beetroot Juice:
బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
తద్వారా శరీరంలో టాక్సిన్ లను బయటకు పంపించడంలో ఇది సహాయపడుతుంది ఇందులో ఉన్న విటమిన్లు చర్మాన్నిమెరిపిస్తాయి.
Tomato Juice:
రోజు టమాటా జ్యూస్ తాగితే చర్మం మెరుస్తుంది ఉదయాన్నే టిఫిన్ కి ముందు టమోటా జ్యూస్ తాగడంలో మంచి ఉపయోగాలు అందుతాయి.
Carrot Juice:
క్యారెట్ జ్యూస్ ముఖ్యంగా కంటి, చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంటుంది. చర్మంపై ఉండే నల్ల మచ్చలని, పింపుల్స్ ను తొలగించేందుకు క్యారెట్ జ్యూస్ తాగడం సరైనది.
క్రమం తప్పకుండా క్యారెట్ జ్యూస్ తాగండిమీ చర్మం లో నిగారింపు మొదలవుతుంది.
Orange Juice:
పొడిగా ఉన్న చర్మంతో బాధపడేవారు విటమిన్ సి అధికంగా ఉండే ఆరంజ్ జ్యూస్ తాగడం చాలా ఉత్తమం ఈ జ్యూస్ లో ఉన్న సిట్రిక్ యాసిడ్ ముసలితనాన్ని నిరోధిస్తుంది.
Lemon Juice:
ప్రతిరోజు నిమ్మరసం తాగడం వల్ల మన రక్తం శుద్ధి అవుతుంది ఇందులో ఉండే విటమిన్ సి మన శరీరంలో ఉన్న టాక్సిన్ లను బయటకు పంపించడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది నిమ్మకాయ రసంతో చర్మం నిగారింపు పొందవచ్చు.
Amla Juice:
ఉసిరిలో అనేక పోషకాలు ఉన్నాయి ఇందులో ఉన్న విటమిన్ సి చర్మాన్ని బిగుతుగా చేయడమే కాకుండా మన శరీరం పై ఉన్న పింపుల్స్ ని మట్టి మాయం చేస్తుంది.