Samantha Dress: ఏం మాయ చేసావే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన సమంత కేవలం టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ స్టార్ బ్యూటీ గా తన పేరుని కైవసం చేసుకుని స్టార్ హీరోయిన్ల జాబితాలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. కానీ ఎప్పుడైతే నాగ చైతన్య తో వివాహం విడాకులు అయ్యాయో అప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఆమెను వెంటాడాయని చెప్పాలి. మరి ముఖ్యంగా ఆమె మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడి కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటూ బ్రేక్ తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. కాగా ఆ వ్యాధి నుండి కోలుకున్న తర్వాత తాను సైన్ చేసిన రెండు ప్రాజెక్టులు ఒకే సారి పూర్తి చేసే పనిలో నిమగ్నమైపోయింది. ఇక అందులో మొదటది విజయ్ దేవరకొండ తో నటిస్తున్న ఖుషి చిత్రం కాగా..
మరొకటి బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్.. ఇక ఖుషి చిత్రం శివా నిర్మాణ దర్శకత్వం లో రూపొదిద్దుకున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్. ఇక ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం యొక్క షూటింగ్ పనులు మొత్తం పూర్తి అవ్వగా.. సెప్టెంబర్ ఒకటవ తారీఖున తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, మలయాళీ, హిందీ భాషలలో విడుదల అవ్వనున్నది. ఇక ఇదే కాకుండా సమంత ఈ చిత్రంతో పాటు ఇటీవలే సిటాడెల్ చిత్రాన్ని కూడా పూర్తి చేసింది. రాజ్ మరియు డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్,సమంత లు జంటగా కలిసి నటించారు. ఇక ఈ యాక్షన్ డ్రామా నెట్ ఫ్లిక్స్ లో త్వరలో స్ట్రీమింగ్ అవ్వబోతున్నది.
ఇక ఈ రెండు చిత్రాలను చక చకా ముగించుకొని సమంత ప్రస్తుతం అమెరికా వెళ్లే పనిలో పడింది. ఇక అక్కడే మెరుగైన వైద్యం తీసుకుని మళ్లీ స్ట్రాంగ్ గా కం బ్యాక్ ఇవ్వాలని నిశ్చయించుకుంది. అందు కోసమే అమెరికా పయనం అవ్వడానికి అన్ని సిద్ధం చేసుకోగా.. ప్రస్తుతం అమెరికా వెళ్లే ముందు ఈ బ్యూటీ పలు అప్లికేషన్స్ ను ప్లాన్ చేసుకుంది. ఇందులో భాగంగానే సమంత కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నది. ఇక ఇక్కడ మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయ సాగింది. ఆ తర్వాత తన ఫ్రెండ్ అనుష స్వామి తో కలిసి ఇండోనేషియాలోని బాలి అందాలను ప్రస్తుతం ఆస్వాదిస్తున్నది. దానికి సంబంధించిన ఫోటో వీడియోలను తన ఇంస్టాగ్రామ్ వేదిక ద్వారా షేర్ చేసుకుంది.
అయితే తాజాగా తాను ధరించిన గ్రీన్ డ్రెస్ ఫ్రాక్ తో షార్ట్ హెయిర్ ను వదిలేస్తూ చిరునవ్వుల పువ్వులు పూయిస్తున్న వీడియోని తన సోషల్ మీడియా ద్వారా పంచుకోగా.. ఆ వీడియో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం సమంత ఆ వీడియోలో ధరించిన డ్రెస్ గురించి నెట్టింట వెతక సాగగా ఆ డ్రస్ ఖరీదు తెలిసిన ఒక్కొక్కరికి తమ కరాబ్ అయినంత పని అయింది. ఎందుకంటే సమంత ధరించిన ఆ (Samantha Dress) డ్రస్సు కల్ట్ గయా కామెరున్ నెట్ డ్రెస్. ఇక చాలా సింపుల్ గా కనిపిస్తున్న ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా అక్షరాల 37,710 రూపాయలు. ఇక ఈ విషయం తెలుసుకున్న చాలా మంది నెటిజన్లు అలాంటి డ్రెస్సు కోఠిలో అదే ధరకు ముప్పై కొనుక్కోవచ్చని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram