Honey Rose First Look: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన బ్యూటీ హానీరోజ్. తేనెలాంటి కళ్లతో కుర్రకారును కట్టిపడేసిన ఈ కేరళ కుట్టి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత తనకు అనుకున్న స్థాయిలో ప్రాజెక్టులు రావడం లేదు. ఇంత అందంగా ఉన్నా తనను ఇండస్ట్రీ పట్టించకోవడం లేదంటూ నసుగకుండా సోషల్ మీడియాలో ఎప్పటికీ ట్రెండింగ్ లో ఉంది ఈ బ్యూటీ.
తన గ్లామర్ లుక్స్, పిక్స్ తో ఎప్పుడూ ట్రెండింగ్ బ్యూటీగా పేరు దక్కించుకుంటుంది. ఆమె సోషల్ మీడియా అకౌంట్లు ట్విటర్, ఇన్ స్టాలో ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. వారి కోసం ఆమె చేసే గ్లామర్ షో ఎప్పటికీ మరుపురానివ్వదు. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోవడంతో సోషల్ వర్క్ చేస్తూ షాపింగ్ మాల్స్ ఓపినింగ్ అంటూ తెలుగు రాష్ట్రాల్లో తెగ సందడి చేస్తుంది. ప్రస్తుతం ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. అది ఆమె తీసే నెక్ట్స్ సినిమా గురించి ఆ సినిమాలో ఒక మటన్ షాపులో ఉంటుంది ఆమె దీనికి సంబంధించిన టీజర్ ను చూసి ఆమె ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.
హానీ రోజ్ తన నెక్ట్స్ సినిమా ‘రాచెల్’కు సంబంధించి టీజర్, ఫస్ట్ లుక్ ను శనివారం విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీలో హానీ సీరియస్ లుక్స్ లో గ్లామర్ గా కనిపించింది. చేతిలో కత్తితో బీఫ్ మాంసం కొడుతుంది. విజువల్స్ లో ఆమె చుట్టూ దున్నపోతుల తలకాయలు ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్, టీజర్ చూస్తుంటే ఆమె బీఫ్ అమ్మే మహిళగా కనిపిస్తుందని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే ఆమెను చిక్కుల్లో పడేసింది.
‘రాచెల్’ పోస్టర్, టీజర్ లో గ్లామర్ గా కనిపించినప్పటికీ నెటిజన్స్ దృష్టి మాత్రం ఆమె చుట్టూ ఉన్న బీఫ్ మాంసం పైనే పడింది. ఈ సినిమాలో ఆమె బీఫ్ మాంసం అమ్ముతుందని, ఆవును చంపడం ఏంటని మండిపడుతున్నారు. ఒక వైపు ఆవును, ఎద్దును చంపవద్దని హిందూ సంఘాలు చెప్తుంటే ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలో నటిస్తావా అంటూ నెటిజన్స్ ఫైరల్ అవుతున్నారట. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం కామెంట్ల వర్షం కురుస్తుంది. అయితే ఆమె మాత్రం ఇప్పటి వరకు వీటిపై ఏ విధంగా స్పందించలేదు. (Honey Rose First Look)