Heroine Anjalis comments: మనందరికీ తెలిసిన విషయమే.. హీరోయిన్ అంజలి అచ్చమైన తెలుగు హీరోయిన్ ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ అంజలికి ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా అడుగుపెట్టి తనదైన శైలిలో సొంత టాలెంట్ తో తనెంతో నిరూపించుకుని ప్రస్తుతం అంది వచ్చిన అవకాశాలతో మంచి హోదాలో అయితే కొనసాగుతుంది. కానీ మొదట్లో వరుస ప్లాపులతో సతమతం అయినప్పటికీ ఆ తర్వాత టాలీవుడ్ లో తనకు అవకాశాలు దక్కకపోవడంతో..
తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అక్కడ స్టార్ హీరోయిన్ గా తనేంటో నిరూపించుకుంది. ఇక ఆ తర్వాతే తెలుగులో పెద్ద అవకాశాలు లభించాయి. పేరుకి తెలుగు హీరోయిన్ అయినప్పటికీ ఇక్కడ అవకాశాలు లభించగానే చెన్నై వెళ్లి అక్కడ సినిమా అవకాశాలను రాబట్టుకోగలిగింది. అలా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హోదాలో నిలదొక్కుకోగలుగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్లో సైతం అంజలి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక ఇటీవలే రామ్ చరణ్ నటించిన గేమ్ చేజర్ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటించబోతోంది.
ఇదే క్రమంలో ఓ మీడియా ఛానల్ కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా అంజలి తన వ్యక్తిగత విషయాలను ఆ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించింది. కాగా.. చాలా రోజులుగా సోషల్ మీడియాలో అంజలి పెళ్లి వార్తలపై వైరల్ అవుతున్న తరుణంలో ఆమెకు ఈ ఇంటర్వ్యూలో కూడా అదే ప్రశ్న ఎదురైంది. దాంతో అంజలి ఆ ఇంటర్వ్యూ లో భాగంగా నేను ఇప్పటి వరకు ఎవరితో రిలేషన్షిప్ లో లేను అంటూ అందరికీ క్లారిటీ ఇచ్చింది. ఇదే కాకుండా రిలేషన్ షిప్ లో రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని.. అది ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలని.. (Heroine Anjalis comments)
ఆ తర్వాతే ప్రేమ అభిమానం మిగతా మరేవైనా కలుగుతాయని.. ఒకవేళ రెస్పెక్ట్ లేని చోట ఏది ఉన్న వేస్ట్ అంటూ చెప్పుకొచ్చింది. నాకు అదొక్కటి ఉంటే చాలు అంటూ.. అంజలి ఓపెన్ కామెంట్ చేసింది. ఇదే కాక తనకు ఆత్మగౌరవాన్ని తన వృత్తికి రెస్పెక్ట్ ఇచ్చేవాడినే పెళ్లి చేసుకుంటానని అదొక్కటి ఆ క్వాలిటీ ఒక్కటి ఉన్న ఎవరైనా నాకు ఓకే అని స్టేటస్ గురించి పెద్దగా పట్టించుకోనని చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూలో భాగంగా అంజలి మాట్లాడిన మాటలు ఆమె కామెంట్స్ వైరల్ గా మారాయి నెట్టింట.. ప్రస్తుతం అంజలి మాట్లాడిన ఈ మాటలను ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్లు..