Tarun – Aarthi Agarwal: తరుణ్ ఆర్తి అగర్వాల్ వీళ్లిద్దరూ ఎంత ఘాఢంగా ప్రేమించుకున్నారో అప్పట్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం గాక తెలుగు సినీ ప్రేక్షకులకు సైతం వీళ్ళ ప్రేమ గురించి తెలిసేలా వీళ్ళ ప్రేమ వ్యవహారం నడిచింది. అలా వీళ్ళు ఎంతో ఘాఢంగా ప్రేమించుకున్నప్పటికీ కేవలం తరుణ్ తల్లి కారణం చేత వీళ్లిద్దరూ విడిపోవలసి వచ్చింది. ఇక ఆర్తి అగర్వాల్ కూడా ఇంట్లో తన తల్లిదండ్రుల ఒత్తిడి భరించలేక వివాహం చేసుకున్నప్పటికీ కేవలం రెండేళ్లు అతనితో కాపురం చేసి ఆ తర్వాత విడాకులు ఇచ్చేసి అతనికి దూరంగా ఇండియాకు వచ్చేసింది.
మళ్లీ సినిమాలలో నటించి బిజీ అవ్వడం కోసం బరువు తగ్గాలని అమెరికా వెళ్లి బరువు తగ్గించుకోవడానికి ఆపరేషన్ చేయించుకోవడంతో ఆపరేషన్ సక్సెస్ కాని కారణం చేత మరణించింది. ఎంతో గాఢంగా ఆర్తి అగర్వాల్ ని ప్రేమించిన తరుణ్ ఆమని మర్చిపోలేక ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా బ్యాచిలర్ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఇంత గాడమైన ప్రేమ చిగురించడానికి కారణం ఆ స్టార్ హీరోనే నట.. మరి ఆ స్టార్ హీరో ఎలా కారణమయ్యాడు? వీళ్లిద్దరి ప్రేమ చిగురించడానికి అసలు ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.? అయితే తరుణ్ ఆర్తి అగర్వాల్ వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా నువ్వు లేక నేను లేను.
ఇక ఈ చిత్రం నుండి వీళ్లిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడి ఆ బంధం ప్రేమగా చిగురించి ప్రేమ కొనసాగిందట. అయితే ఇప్పుడు అసలు ముచ్చట ఏందో చూద్దాం. ఇక ఈ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ తరుణ్ కాదట మహేష్ బాబుతో తీద్దామని అనుకున్నారట. అయితే ఈ చిత్రం యొక్క డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ గారు మొదట స్టోరీని సురేష్ బాబు గారికి చెప్పినప్పుడు ఈ స్టోరీకి మహేష్ బాబు కరెక్ట్ గా సూట్ అవుతాడని చెప్పగా.. అప్పటికే వేరే సినిమాలలో బిజీగా ఉన్న మహేష్ బాబు ఈ చిత్రం చేయడానికి డేట్స్ ఖాళీగా లేక నో చెప్పాడట.. దాంతో చేసేదేమీ లేక ఎవరా అని ఆలోచిస్తూ చివరగా హీరో తరుణ్ ను సెలెక్ట్ చేశారట.
ఒక వేళ మహేష్ బాబు వేరే చిత్రాలలో బిజీగా ఉండకుండా ఈ చిత్రంలో నటించినట్లయితే కనుక తరుణ్ ఆర్తి అగర్వాల్ మధ్య ప్రేమ చిగురించేది కాదని అంటున్నారు. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రం నుండి తప్పుకోవడం వల్లే తరుణ్ కి నువ్వు లేక నేను లేను చిత్రంలో అవకాశం రావడంతో ఆర్తి అగర్వాల్ తో ప్రేమలో పడడానికి కారకుడయ్యాడట. ఇంతలా ప్రేమించుకున్నప్పటికీ కూడా వీళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్లకుండా చివరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ కారణం చేత ఇప్పటికి ఇంకా తరుణ్ ఒంటరిగా బ్యాచులర్ గానే మిగిలిపోయాడు. ఒకవేళ ఈ చిత్రంలో మహేష్ బాబు కనుక హీరోగా నటించి ఉంటే అసలు వాళ్ళిద్దరి (Tarun – Aarthi Agarwal) మధ్య ప్రేమ చిగురించి ఉండేది కాదు.