Hi Nanna : నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా శౌర్యువ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా హాయ్ నాన్న. ఈ సినిమా డిసెంబర్ 21ని రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై నాని అభిమానులకు ( Nani son question Hi Nanna movie ) భారీ అంచనాలు ఉన్నాయి. దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత నాని వస్తున్నా సినిమా ఇది సినిమాలో నాని సెంటిమెంట్ పండిస్తాడని చాలా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ఇక సీతారామన్ సినిమాతో తెలుగులో మాత్రమే కాకుండా, యావత్ భారత దేశంలో మంచి పేరు సంపాదించుకున్న మృణాల్.. ఈ సినిమాలో కూడా మంచి పేరు తెచ్చుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు.
డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ ఉండగా ఈ సినిమాపై అనేక ప్రమోషన్స్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నాని ఈ సినిమా ప్రమోషన్ కోసం ఎంతో కష్టపడుతున్నాడు ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇదే క్రమంలో ఇటీవల సుమ.. నానిని ( Nani son question Hi Nanna movie ) ఒక ప్రోగ్రాం లో ఇంటర్వ్యూ చేయగా అనేక ప్రశ్నలు అడిగింది. ఇక ఆ ప్రశ్నలకు నాని నవ్వుల వర్షం కురిపించాడు. మీరు ఈ సినిమాలో ఈ అమ్మాయికి ఫాదర్ అని, అలాగే మృణాల్ ఠాకూర్ మిమ్మల్ని ప్రేమిస్తుందని, ఏవేవో చూపిస్తున్నారు. కాకపోతే మాకైతే ఆ ట్రైలర్ చూస్తుంటే ఎన్నో అనిపిస్తున్నాయి. అందులో ఏది బయట అసలు విషయం ఏంటి చెప్తారా అని అడిగింది.
ముందు మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. ఆ తర్వాత నాకు నేను చెప్తే మాట్లాడుతాను అని అన్నాడు. అయితే ఆ సినిమాలో ఒక్కొక్కసారి మీరు అమ్మాయి ఫాదర్ రియల్ ఫాదర్ కాదనిపిస్తుంది, ఒక్కోసారి ఆమె ఈ అమ్మాయికి మదర్ కాదనిపిస్తుంది, ఒక్కసారి మీ లవర్ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఈ అమ్మాయి మదర్ మీకు లవర్ కాదనిపిస్తుంది అంటే.. నాని నవ్వుకుంటూ మీకు చాలా అనిపించేస్తున్నాయి అని అన్నాడు. అయితే నాని తన కూతురుగా ( Nani son question Hi Nanna movie ) నటించిన కియారాతో ఇలా.. ఆంటీ ఈ సంగతులన్నీ అడుగుతుంది.. ఇవన్నీ ఇప్పుడు చెప్పినా సినిమా చూసి తెలుసుకోమని చెప్పనా? అని అడిగాడు. సినిమా చూసుకుని తెలుసుకోమనండి అని పాప చెప్పింది. దానితో నాని.. సుమతో కూడా ఇవన్నీ డౌట్స్ మీకు సినిమా చూస్తే అర్ధమవుతుంది అని అన్నాడు.
ఇదిలా ఉంటే నాని సినిమా హాయ్ నాన్న ట్రైలర్ చూసి మీ అబ్బాయి ఏమన్నాడు అని అడిగింది. నాని దానికి ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. నా కొడుక్కి ఇప్పుడిప్పుడే సినిమాలు గురించి తెలుస్తుంది. దసరా సినిమా చూసాడు గాని పెద్దగా అర్థం కాలేదు. ఈ సినిమా మాత్రం తనకి ట్రైలర్ చూస్తుంటే కొంచెం అర్థం అవుతుంది. దసరా సినిమాలో నా గెటప్ డిఫరెంట్ గా ఉండటం వలన.. ఆ సినిమా వాడు పట్టించుకోలేదు. ఈ సినిమాలో నా లుక్ వాడి ఫాదర్ లాగే ఉంది. హాయ్ నాన్న అంటే నేను కదా నిన్ను నాన్న అనాలి. ఆ అమ్మాయి ఎవరో నిన్ను నాన్న అంటుంది? ఆ అమ్మాయి ఎవరు? చాలా క్యూట్ గా ఉంది అని ప్రశ్నించాడంట. ఈ సినిమాలో నేను కదా నటించాలి. హాయ్ నాన్న అని నీతో ఆ అమ్మాయి ఎవరు ఎందుకు నటిస్తుంది అని అడిగాడంట. దాంతో నాని ఈ మాటలు తన కొడుకు అడిగిన ప్రశ్నలను సుమతో పంచుకున్నాడు.