Home Cinema Nani: వీడు హీరో ఏంటి కమెడియన్.. హీరో నానిని ఘోరంగా అవమానించిన స్టార్ హీరో..

Nani: వీడు హీరో ఏంటి కమెడియన్.. హీరో నానిని ఘోరంగా అవమానించిన స్టార్ హీరో..

Nani Got Insulted: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోలు కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలను ఎదురుకున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు స్టార్స్ గా మరియు సూపర్ స్టార్స్ గా కొనసాగుతున్నారు. మన టాలీవుడ్ లో బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అయ్యే వాళ్లకి మెగాస్టార్ చిరంజీవి ఒక ఆదర్శం. ఆయనని ఆదర్శం గా తీసుకొని ఎలా అయినా హీరో అవ్వలానే కసితో ఇండస్ట్రీ లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిలో మన మాస్ మహారాజ రవితేజ ఒకడు, ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని ఒకడు.

See also  Niharika : మరో రూమర్ కి అవకాశం ఇచ్చే పని చేసిన నిహారిక.. తలలు పట్టుకుంటున్న మెగా ఫాన్స్!

Nani-got-insulted

ఇప్పుడు ప్రత్యేకించి నాని గురించి మాట్లాడుకోబోతున్నాము. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన నాని ‘అష్టా చమ్మ’ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అయ్యాడు. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరి ఫీలింగ్ అప్పట్లో ఎవరీ కుర్రాడు, అందంగా ఉన్నాడు, అద్భుతంగా కూడా నటిస్తున్నాడే అని అనుకునేవారు. ఆ సినిమా తర్వాత విభిన్న తరహా పాత్రలు మరియు సినిమాలు చేస్తూ యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఇమేజి సంపాదించి న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు రీసెంట్ గా దసరా సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, వంద కోట్ల రూపాయిల క్లబ్ లోకి కూడా ఎంటర్ అయిపోయాడు.

See also  Mega Star: తమన్నా అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టిన మెగాస్టార్ చిరంజీవి..

nani-hero

ఇదంతా తన సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకున్నదే. ఇలాంటి టాలెంట్ ఉన్న హీరో ని ఒక ప్రముఖ స్టార్ హీరో నాని ని ఘోరంగా అవమానించాడట(Nani Got Insulted). ‘అష్టా చమ్మ’ సినిమా కోసం నాని ఒక స్టార్ హీరో దగ్గరకి వెళ్తే, ఏంటి వీడు హీరోనా? చూసేందుకు కమెడియన్ లాగ ఉన్నాడు, వీడిని పెట్టి సినిమా ఎలా తీస్తున్నారు అని నిర్మాత సురేష్ బాబు ని అడిగాడట. ఆ మాటలు విన్న తర్వాత నాని మనసు ఎంతో నొచ్చుకుంది. అలాంటి అవమానాలు ఒకటి కాదు, రెండు కాదు చాలానే పడ్డాడు. వాటి అన్నిటినీ తట్టుకొని నేడు ఆయన ఈ స్థానం లో ఉన్నాడు.

See also  Nani: నాని నోట అలాంటి మాట..? తప్పే లేదు ఆ బూతు పదాన్ని వాడమంటున్నాడు..! ఫ్యాన్స్ ఫైర్...

hero-nani

భవిష్యత్తులో ఇంకా ఏ రేంజ్ కి వేళ్తాడో చూడాలి. అయితే నాని ని అంత ఘోరంగా అవమానించిన ఆ హీరో ఎవరు ఏమిటి అనే విషయం మాత్రం బయటకు రాలేదు. ఇప్పటికీ ఆ స్టార్ హీరో తో నాని మాట్లాడడం లేదట. ప్రస్తుతం నాని తన 30వ సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. సినిమా పేరుని ఐతే ఇంకా ఖరారు చేయలేదు కానీ సినిమా కాస్టింగ్ మొదలు పెట్టేసారు. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ని ఎంపిక చేసుకున్నారు సినిమా బృందం.