Home Cinema Gayathri Gupta : నేను ఎక్కువ రోజులు బ్రతకనని డాక్టర్లు చెప్పారు.. వింత రోగం తో...

Gayathri Gupta : నేను ఎక్కువ రోజులు బ్రతకనని డాక్టర్లు చెప్పారు.. వింత రోగం తో గాయత్రి గుప్తా..

Gayathri Gupta : టాలీవుడ్ లో బోల్డ్ గా మాట్లాడుతూ, బోల్డ్ గా ప్రవర్తించే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు గాయత్రీ గుప్త. ఈమె ఇండస్ట్రీ లో తనకి ఎదురైనా అనుభవాల గురించి ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పుకొస్తూ ఉంటుంది. ముఖ్యంగా సినిమా ప్రారంభం అయ్యే ముందు తన పాత్ర గురించి చెప్పేది ఒకటి, తీరా షూటింగ్ కి వెళ్లిన తర్వాత అక్కడ తీసేది మరొకటి అంటూ చెప్పుకొచ్చింది గాయత్రీ గుప్త. తనకి కూడా ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు వచ్చాయి కానీ, వాళ్ళు అడిగిన పనులు మాత్రం చెయ్యలేదని, అలా ముక్కుసూటి తనంతో పోతూనే నేడు ఇండస్ట్రీ లో ఇక్కడి దాకా వచ్చాను అంటూ చెప్పుకొచ్చింది గైతరి గుప్తా.

See also  Priyamani: ఆ దర్శకుడు నన్ను నమ్మించి మోసం చేసాడు అంటూ సంచలమనైన ఆరోపణలు చేసింది ప్రియమణి..

Gayathri-Gupta

అయితే నేను షూటింగ్ విషయం లో చాలా పక్కాగా ఉంటానని, సంతకం చేసే ముందు నాకు ఏ కథ అయితే చెప్పారో, ఆ కథ తీసేంత వరకు మాత్రమే నేను పని చేసానని, ఆ తర్వాత నేను చెయ్యలేదు అంటూ వ్యాఖ్యానించింది. అయితే తనతో అసభ్యంగా వ్యవహరించిన హీరోలు , డైరెక్టర్స్ కూడా ఉన్నారని, వాళ్ళ పేర్లు ఇప్పుడే చెప్పను, నాకు 60 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు చెప్తా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ బోల్డ్ హాట్ బ్యూటీ. అంతే కాకుండా చాలా సినిమాల్లో రెండు రోజులు షూటింగ్ చేయించుకొని డబ్బులు కూడా ఇవ్వకుండా తీసేసిన సందర్భాలు చాలానే ఉన్నాయని ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

See also  Pawan Kalyan: రామ్ చరణ్ సింగపూర్ లో పవన్ కళ్యాణ్ కు నరకం చూపించాడట.. అసలేమయ్యింది.?

gayathri-gupta-health

ఈ ప్రపంచం లో మనం బ్రతకడం అనేది ఎంత రిస్కో, ఈ సినిమా ఇండస్ట్రీ లో బ్రతకడం కూడా అంతే రిస్క్, అయితే బయట ప్రపంచం కంటే ఇక్కడ ఇంకా యాక్టీవ్ గా ఉండాలని, లేకపోతే ఇక్కడ మనుగడ సాగించడం కష్టం అంటూ చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉండగా ఈమెకి పెయిన్ కిల్లర్స్ వాడడం బాగా అలవాటు అట, అలా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల లివర్ డ్యామేజీ అవుతుందని భయం ఉండేది. కానీ డాక్టర్లు నేను 5 సంవత్సరాల తర్వాత చనిపోతానని చెప్పారు, ఇక అప్పటి నుండి మనకి పెయిన్ కిల్లర్స్ తో అవసరం లేదని పక్కన పేడేసాను అంటూ చెప్పుకొచ్చింది గాయత్రీ గుప్త.

See also  Bhola Shankar: భోళా శంకర్ దెబ్బకి చిరంజీవి తీసుకున్న నిర్ణయంతో అభిమానులు వాటికి దూరం.

gayathri-gupta

ఇకపోతే ఇప్పటి వరకు ఈమె బుర్ర కథ, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, సీతా ఆన్ ది రోడ్ వంటి చిత్రాలలో నటించింది. ఒక సమయంలో వెలుగు వెలిగిన గాయత్రి గుప్తా(Gayathri Gupta) ఇపుడు కనుమరుగై పోయింది. మంచి సినిమా ఆఫర్ లు వచ్చి చిన్న చిన్న పాత్రలు చేస్తున్న సమయంలో తాను బిగ్ బాస్ పై కేసు వేయటం చాల మైనస్ అయింది. అలా చేసినప్పటి నుండి గాయత్రీ కి అసలు సినిమా ఆఫర్ లు రావటం ఆగిపోయాయి అనే చెప్పాలి. ఇపుడు ఎం చేస్తుందో ఎలా సంపాదించుకుంటుందో ఎవరికీ తెలీదు.