Ganesh Chaturthi 2023 : వినాయక చవితి వస్తుంది అంటే చిన్న పెద్ద తేడా లేకుండా.. పేద గొప్ప అనే వ్యత్యాసం లేకుండా.. అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ. ఏ పని చేయాలన్నా, ఏ దేవుణ్ణి పూజించాలన్న, ఏ తలంపున ( Ganesh Chaturthi 2023 puja ) తలంచాలన్న మొదటిగా అందరం తలచుకునేది ఏ విఘ్నాలు లేకుండా చూడమని ఆ విగ్నేశ్వరుడినే. అటువంటి వినాయకుడిని పూజించుకునే పండుగ రోజు వినాయక చవితి. వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి.. పూజ చేసుకొని, అన్ని శాస్త్రవేత్తంగా పూజ చేసి, కథ చదివి, కథ అక్షింతలను తల మీద వేసుకుంటే ఆరోజు చంద్రుడిని చూసినా కూడా ఎటువంటి నీలాప నిందలు రాకుండా ఉంటామని మనందరికీ తెలిసిందే. ఇది కచ్చితంగా ఎవరు ఎక్కడ ఎప్పుడు ఉన్నా అక్కడ దగ్గరలో ఉన్న ఎవరు పూజ చేసినా కూడా అక్షింతలు తీసుకొని వేసుకోవాలి..
వినాయక చవితి నాడు మన స్థోమతను బట్టి తగ్గకుండా.. గణపతి విగ్రహాన్ని తెచ్చుకొని, మనకు శక్తిని బట్టి, భక్తితో అన్ని రకాలుగా పూజను ( Ganesh Chaturthi 2023 puja ) చక్కగా చేసుకోవాలి. నలుగురు బంధువులని స్నేహితులని.. పిలిచి భోజనాలు పెట్టుకుని.. మనకి పనిచేసే వాళ్ళని అందరినీ కూడా ఆరోజు ప్రేమగా చూసి, వాళ్లకు కూడా భోజనం పెట్టి ప్రసాదం పెట్టాలి. వినాయక చవితినాడు ఏ రాశి వారు ఎలా ఆ గణపతికి, పూజ, నైవేద్యం సమర్పిస్తే అదృష్టం కలుగుతుందో అన్ని శుభాలు జరుగుతాయో తెలుసుకుందాం..
మేషం: మేష రాశి వారు వినాయకుడిని పూజించుకున్న తర్వాత సెనగపిండి లేదా మోతీచూర్ లడ్డుని నైవేద్యంగా సమర్పించడం వలన అంతా మంచి జరుగుతుంది.
వృషభ రాశి: వృషభ రాశి వారి కష్టాలన్నీ తొలగాలంటే వినాయకుడికి మోదిక నైవేద్యంగా సమర్పించాలి.
మిధున రాశి: మిధున రాశి వారు వినాయకుడిని పూజించేటప్పుడు ఆ వినాయకుడికి ఆకుపచ్చని వస్త్రములు సమర్పించుకుంటే వాళ్లకు మంచి జరుగుతుంది.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారు వినాయక చవితినాడు వినాయకుడికి తెల్లచందన తిలకం రాస్తే వారి జీవితం సంతోషంగా ఉంటుంది.
సింహరాశి: సింహ రాశి వారు వినాయక చవితి నాడు ఎర్రని పువ్వులను భగవంతుడికి సమర్పిస్తే వాళ్లకు అంతా మంచి జరుగుతుంది.
కన్య రాశి: ఈ రాశి వారు వినాయక చవితి నాడు తమలపాకులు దేవుడికి సమర్పిస్తే అన్ని అనుకున్నట్టు పనులు జరుగుతాయి.
తులారాశి: ఈ రాశి వారు వినాయక చవితి నాడు వినాయకుడికి తెల్లని పువ్వులతో పూజ చేయాలి. దానివలన వారికి అన్ని సానుకూలంగా ఉంటాయి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు వినాయక చవితి నాడు వినాయకుడికి ఇష్టమైన దూర్వా హారాన్ని సమర్పించడం వలన అంతా మంచి జరుగుతుంది.
ధనస్సు రాశి: ఈ రాశి వారు వినాయక చవితి నాడు వినాయకుడిని పసుపు పుష్పాలు, పసుపు వస్త్రాలు సమర్పించి పసుపు రంగు మిఠాయితో పూజ నైవేద్యం పెడితే అంతా మంచి జరుగుతుంది.
మకర రాశి: మకర రాశి వారు వినాయకుడికి నీలిరంగు పువ్వులను సమర్పిస్తూ పూజ చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి.
కుంభరాశి: ఈ రాశి వారు వినాయకుడికి డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా పెడితే వీళ్ళకి డబ్బులు వర్షం కురుస్తుంది.
మీనరాశి: ఈ రాశి వారు వినాయకుడికి పసుపు వస్త్రం పసుపు వస్త్రాలు సమర్పిస్తే పసుపు పుష్పాలు సమర్పిస్తే వాళ్ళ జీవితం హాయిగా ఆనందంగా ఉంటుంది.
ఇలా వినాయకుడిని అన్ని రాశుల వారు అలా సాధ్యమైనంత వరకు పూజించుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ అందులో ఏది అందుబాటులో లేకపోయినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వినాయక చవితినాడు గణపతిని మనసారా భక్తిశ్రద్ధలతో పూజించి, ఆయన కథను చదివినా.. ఎవరైనా చదువుతుండగా విన్న ఆ కదా అక్షింతలను నెత్తిమీద వేసుకున్న.. ఆయనకి మూడు గుంజీలు తీసి దండం పెట్టుకున్న.. అనుకున్న పనులన్నీ జరిగి ఆనందంగా ఉంటాము.