Prabhas – Anushka : ప్రభాస్ 44వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరూ ప్రభాస్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. సినీ అభిమానులు, ప్రభాస్ అభిమానులు, సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు, అందరూ కూడా ఎంతో ఆనందంగా ప్రభాస్కి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ప్రభాస్ జీవితంలో కెరీర్ ఎంత ముఖ్యమైనదో.. ఇంకొక ( Prabhas and Anushka sensational news ) దానికి ఆయన అభిమానులు చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అది ఏమిటో మనందరికీ తెలిసిందే.. ప్రభాస్ పెళ్లి. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ప్రతి హీరో అభిమానులు ఎదురు చూస్తారు కానీ.. ప్రభాస్ పెళ్లి మాత్రం ఖచ్చితమైన కోరికతో ఎదురుచూస్తున్నారు.
అదేంటంటే.. ప్రభాస్ పెళ్లి చేసుకోవాలి కానీ అనుష్కనే చేసుకుంటే బాగుంటుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ అనుష్క కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి 2 సినిమాలలో నటించారు. వీళ్ళిద్దరూ ( Prabhas and Anushka sensational news ) కలిసి నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా ప్రతి దాంట్లో వీళ్లిద్దరూ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఎక్కడ వీళ్ళిద్దరూ కనిపించినా కూడా అందరిలోని ఒకేసారిగా ఆనందం కనిపిస్తుంది. ఒకరితో ఒకరు ఎంత ఆనందంగా ఉంటారో అర్థమవుతుంది కానీ.. ప్రభాస్, అనుష్క ఎప్పుడు బయటకు చెప్పేది ఒకటే మాట.. మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అని.
అయితే ఇటీవల ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర మీడియా వాళ్లతో ఆమె మనసులో మాట పంచుకుంది. వచ్చే ఏడాది దసరా లోపల ప్రభాస్ కి కచ్చితంగా పెళ్లి చేసేస్తున్నామని చెప్పుకొచ్చింది ఆమె. అయితే దానితో ఇక ప్రభాస్ కి పెళ్లి జరగబోతుందని.. అయితే అనుష్క అయి ఉంటాది లేదా ( Prabhas and Anushka sensational news ) ఎవరైనా బయట వాళ్ళు అయి ఉంటారు అంటూ అనేక వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ఒక ఇంగ్లీష్ వెబ్సైట్ టైమ్స్ అవుట్ వెబ్సైట్ ఒక సంచలనమైన విషయాన్ని బయటపెట్టింది. అది ఏమిటంటే.. ప్రభాస్, అనుష్కల గురించి ఒక విషయాన్ని వార్తగా ప్రచారం చేసింది.
ప్రభాస్, అనుష్క ఒకరినొకరు ప్రేమించుకున్నారని.. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని.. ఒకవేళ పెళ్లి జరగకపోతే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకుండా అలా ఉండి పోదామని అనుకున్నారని అంటుంది. దానికి కారణం కూడా ప్రభాస్, అనుష్కల మధ్య జాతకాల కుదరలేదని.. ప్రభాస్ తల్లిగారు జాతకాలని చాలా గట్టిగా నమ్ముతారని.. అందుకని వాళ్ళిద్దరు పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయారని వార్తను ప్రచారం చేసింది. ప్రభాస్ పెద్దమ్మ చూస్తే.. ప్రభాస్ పెళ్లి జరుగుతుంది అని అంటున్నారు. ఈ వార్త చూస్తే ఇలా ఉంది. మరి ఈ రెండిట్లో ఏది నిజమవుతుందో, ఏమవుతుందో తెలియడం లేదని అనుకుంటున్నారు. ఏదేమైనా ఇంగ్లీష్ వెబ్సైట్ ప్రచురించిన వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. ఏదో రకంగా ప్రభాస్ కి పెళ్లి జరగాలని మాత్రం అందరూ కోరుకుంటున్నారు.