Home Cinema Eesha Rebba: పెళ్లవ్వకుండానే ఇద్దరు పిల్లల తల్లైనంటున్న మన తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ.! మరి...

Eesha Rebba: పెళ్లవ్వకుండానే ఇద్దరు పిల్లల తల్లైనంటున్న మన తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ.! మరి తండ్రి ఎవరు.?

Eesha Rebba: ఈషా రెబ్బ మన తెలుగు హీరోయిన్. తెలంగాణలోని వరంగల్ లో జన్మించిన ఈ అమ్మడు పలు తెలుగు చిత్రాలలో నటిస్తున్న సత్తా చాటుకుని తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. ఆలా మొదటగా నటించిన చిత్రం అమీతుమీ ఆ తర్వాత బ్రాండ్ బాబు, అ, సుబ్రహ్మణ్యపురం, బందిపోటు, అరవింద సమేత వీర రాఘవ తదితర చిత్రాల్లో నటించింది. అయితే ఈమె నటించిన చిత్రాలన్నీ లో బడ్జెట్ చిత్రాలు కావడం అవి హిట్ అవడంతో తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు కాస్త పేరు లభించి చోటు దక్కిందని చెప్పాలి. అయినప్పటికీ స్టార్ హీరోల చిత్రాల లో మాత్రం అవకాశాలు లభించడం లేదు.

See also  Ram Charan-Upasana: క్లిం కార పుట్టి నెల కాకుండానే రామ్ చరణ్ ఉపాసన ఎం చేసారో తెలుసా?

eesha-rebba-reveals-she-has-two-kids-even-though-she-is-not-married-who-is-the-father

కాగా ఇటీవల ఈ అమ్మడు చెడి చక్రవర్తి సరసన దయా అనే వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగానే ఈ అమ్మడు ఇటీవలే సుమ కనకాల షో సుమ అడ్డ అనే ప్రోగ్రామ్ లో పాల్గొనింది. ఈషా రెబ్బ, జెస్సి, గౌతమి, రవి వర్మ తదితరులు ఈ షో లో పాల్గొన్నారు. ఇక ఈ షో మొత్తం చాలా నవ్వుల పంట పండిస్తూ ఫుల్ కామెడీగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా అంతటా చెక్కర్లు కొడుతూ హల్చల్ చేస్తూ వైరల్ గా మారింది.

See also  Hina Khan: క్యాన్సర్ తో ఈ హీరోయిన్ ఎలా పోరాడుతుందో చూడండి..

eesha-rebba-reveals-she-has-two-kids-even-though-she-is-not-married-who-is-the-father

ఇక ఈ షో లో ని ప్రోమోలో భాగంగా సుమ కనకాల పలు ప్రశ్నలు సంధిస్తుండగా అందులో ఓ ప్రశ్న సుమ అడుగుతూ పెళ్లి త్వరగా ఏ టైం లో చేసుకోవాలని అనిపిస్తుంది అని అడుగుతుంది. దానికి వెంటనే టక్కున ఈషా రెబ్బా పెళ్లి జరగకముందే తొందరపడినప్పుడు అనే సమాధానం చెబుతుంది. దాంతో అక్కడున్న వాళ్ళందరూ తెగ నవ్వేస్తారు. ఇక ఆ తర్వాత మరొక ప్రశ్న కూడా సుమా కనకాల అడుగుతుంది. ప్రేమ గురించి కూడా ఏమైనా చెప్పండి అని అడగ్గా షాకింగ్ సమాధానం ఈషా రెబ్బ తెలియజేస్తుంది.

See also  Samantha: సమంత ఇస్టా పిక్ వైరల్.. మరీ ఇంతలా గుర్తుపట్టకుండా మారిపోయిందేంటి.?

eesha-rebba-reveals-she-has-two-kids-even-though-she-is-not-married-who-is-the-father

నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటూ ఈషా రెబ్బ (Eesha Rebba) సంచలమైన విషయాన్ని ఈ ప్రోమో లో భాగంగా వెల్లడిస్తుంది. దీంతో ఒక్కసారి ఉలిక్కిపడి షాకైన సుమ మరి ఆ పిల్లలకు తండ్రి ఎక్కడ అని అడగ్గా.? అంతటితో ఈ ప్రోమో షో వీడియో కట్ అయిపోతుంది. ఇంతకు ఈషా రెబ్బ దానికి సమాధానం ఏం చెప్తుంది? అసలు ఈషా చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉందనేది తెలియాలంటే సుమ కనకాల షో విడుదల అయిన తర్వాత చూడాల్సిందే చూస్తే గాని మనకు అసలు విషయం తెలియదు.