Home Cinema Vadde Naveen: హీరో వడ్డే నవీన్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఆయన ఎలా తయారయ్యాడో చూస్తే ఆశ్చర్యపోతారు..

Vadde Naveen: హీరో వడ్డే నవీన్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఆయన ఎలా తయారయ్యాడో చూస్తే ఆశ్చర్యపోతారు..

do-you-remember-hero-vadde-naveen-see-how-is-he-now-logo

Vadde Naveen : మనం చిన్నతనం లో ఉన్నప్పుడు కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగా చేసే హీరోలలో ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్న నటుడు వడ్డే నవీన్. ఆరోజుల్లో వడ్డే నవీన్ సినిమాలకు మంచి మార్కెట్ ఉండేది. కుటుంబ కథ చిత్రాలతో పాటుగా, ప్రేమ కథ చిత్రాలు కూడా వడ్డే నవీన్ రెగులర్ గా చేసేవాడు. అమ్మాయిలలో ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది. పెళ్లి, మనసిచ్చి చూడు, ప్రేమించే మనసు, మా బాలాజీ, చాలా బాగుంది ఇలా ఒక్కటా రెండా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఆయన ప్రేక్షకుల్లో ఎప్పటికీ మర్చిపోలేని ముద్ర వేసాడు.

See also  Rashmika: ఆ రెండు సీక్రెట్ టాటోల అర్ధాలు తెలిపిన రష్మిక.. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా.?

ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ కుమారుడిగా నవీన్(Vadde Naveen) ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. వడ్డే రమేష్ ఇది వరకు స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించాడు. ఇదంతా పక్కన పెడితే 2010 వ సంవత్సరం వరకు వడ్డే నవీన్ యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ ఉండేవాడు. కానీ ఆయన మార్కెట్ 2003 వ సంవత్సరం లోనే పూర్తిగా పోయింది. అయినా కూడా ఈయనతో సినిమాలు చేసే వాళ్ళు ఉండేవారు. అలా 2010 వరకు కెరీర్ ని నెట్టుకొచ్చిన ఆయన, ఆ తర్వాత సినిమాల్లో కనిపించకుండా పోయాడు. మళ్ళీ 2016 వ సంవత్సరంలో మంచు మనోజ్ హీరో గా నటించిన ‘ఎటాక్’ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చాడు.

See also  Bala Krishna: చిరంజీవి నటించిన ఆ చిత్రం బాలయ్య కు అంత నచ్చిందా.? అందుకే వంద సార్లు చూశాడా.? ఏమిటది..

ఆ సినిమా ఆయన కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడలేదు. వడ్డే నవీన్ గురించి ఎవరికీ తెలియని పలు ఆసక్తికరమైన విషయాలను పరిశీలిస్తే ఈయన ఎన్టీఆర్ మనమరాలు చాముండేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో కొన్ని విబేధాలొచ్చి విడిపోయాడు. కొన్నాళ్ళకు రెండవ పెళ్లి చేసుకున్న వడ్డే నవీన్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొన్నీమధ్యనే కొడుకు ధోతీ ఫంక్షన్ చేయగా, చిరంజీవి తో పాటు ఇతర ప్రముఖులు కూడా ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ప్రస్తుతం వ్యాపార వ్యవహారాల్లో ఫుల్ బిజీ గా గడుపుతున్న వడ్డే నవీన్, సినిమాలకు దూరంగానే ఉంటున్నారు.

See also  Bhagavanth Kesari Review and Rating : భగవంత్ కేసరి బెస్ట్ రివ్యూ మరియు రేటింగ్.. హిట్టా ఫట్టా..

అంతే కాదు గత రెండు మూడు సీజన్స్ నుండి ఆయనకీ బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది. అందరూ ఆయన ఆఫర్ ని అంగీకరించి హౌస్ లోకి రావాలని కోరుకున్నారు. కానీ నెగటివిటీ కి భయపడి ఆయన అటు వైపు కూడా కన్నెత్తి చూడలేదు, భవిష్యత్తులో కూడా ఆయన బిగ్ బాస్ లోకి రావడం కష్టమే.