స్టూడెంట్ నెంబర్ 1 సినిమా హీరోయిన్ గుర్తుందా.? తను ఇప్పుడు ఎలా మారిపోయింది చూశారా
Gajala: 1985 మే 19న ముంబైలో జన్మించింది గజాల. తల్లిదండ్రులు దుబాయ్ లో నిర్మాణరంగంలో వ్యాపారవేత్తలు. ముంబాయిలోగల జుహూ విద్యానిది పాఠశాలలో ప్రాధమిక విధ్య పూర్తి చేసింది. అమ్మనాన్నలు దుబాయ్ లో ఉన్నప్పటికీ గజాలకు నటకమీద ఆసక్తి కలిగి ఇక్కడే ఉండి సినిమాల్లో నటించింది.
గజాల అసలు పేరు రాజి, సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరు గజాలాగా మార్చుకుంది. తెలుగులోనే తొలి చిత్రం జగపతిబాబుతో నాలో ఉన్న ప్రేమ.
ఆ తర్వాత యస్.యస్.రాజహౌళి దర్శకత్వం వహించిన స్టూడెంట్ నంబర్.1 తో సూపర్ హిట్టు కొట్టింది. అలా వరుసగా తెలుగుతో పాటు తమిళం, మళయాల చిత్రాల్లో కూడా నటించింది.
అన్ని బాషల్లో కలిపి దాదాపు 30 సినిమాల కంటే ఎక్కువ చిత్రాల్లో నటించింది. తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే ఐనప్పటికీ చాలా మంచి పేరు తెచ్చుకుంది.
అందంతో పాటు నటనలో ప్రతిభ కూడా ఉనన్నప్పటికీ అందరి హీరోయిన్లకు ఆవగింజంత అదృష్టం వరించాలి లేకపోతే అవకాశాలు లేక సిని పరిశ్రమకు శాశ్వతంగా దూరమైపోతారు.
2011లో చివరి చిత్రంలో నటించిన తర్వాత తనకు అవకాశాలు లేక దుబాయ్ లోని తన తండ్రి వ్యాపారంలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేసింది. గజాల ఒక్కరే కాదు, కొత్తవారికి అవకాశాలు రావాలంటే పాతవారు కనుమరుగుకావలసిందే అందులో గజాల ఒకరనుకోవాలి.
జులై 22, 2002 లో హైద్రాబాదులోని బంజారాహిల్స్ లో ప్రశాంత్ కుఠీర్ అనే అథిది గృహంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాహత్నం చేసింది. సహ నటులు సుల్తానా, అర్జున్ సమయానికి గుర్తించి తనను నిమ్స్ ఆస్పత్రికి తరిలించి ప్రాణాప్రాయం నుండి తనను కాపాడారు.
ఆమె ఆత్మహత్యాయత్నానికి ఇప్పటి వరకు కారణాలేంటో తెలియరాలేదు. దాని తర్వాత పూర్తిగా హైద్రాబాద్ నుండి వెళ్ళిపోయింది. 2016 లో టీవీ నటుడు ఫైజల్ రజాఖాన్ ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది.