Samajavaragamana: ఇటీవల కాలంలో భారీ ఎత్తున ప్రమోషన్ చేస్తున్న చిత్రాలు భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న చిత్రాలు ఎలా బోల్తా కొడుతున్నాయో మనందరం చూస్తున్నాం.. కానీ సాదా సీదాగా ఎలాంటి ఆర్భాటం లేకుండా విడుదలవుతున్న చిత్రాలు సంచలనాలను సృష్టిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సినిమా ప్రపంచంలో ట్రెండ్ అనేది రాను రాను మారిపోతూ ఉందనే చెప్పాలి. స్టార్ హీరోలను పెట్టి కోట్లకు కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తున్న చిత్రాలన్నీ బొక్క బోర్లా పడుతుంటే.. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చాలా సింపుల్ గా విడుదలయి కోట్ల కు కోట్లు లాభాలు తెచ్చిపెడుతున్న సినిమాలు ఇప్పటికీ చాలానే చూసాం.
అయితే ప్రస్తుతం అలాంటి చిత్రం కూడా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ చిత్రం తో ఈ లిస్టులోకి చేరిపోయాడు హీరో శ్రీ విష్ణు. ఆయన నటించిన సామజవరగమన చిత్రం ఇటీవల విడుదలై సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ అందుకొని సక్సెస్ దిశగా పయనిస్తూ ఉన్నది. అయితే ఈ చిత్రం జూన్ 29న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద రికార్డు బద్దలు కొడుతూ ఇదివరకు ఎన్నడూ లేని విధంగా రికార్డులను తిరగరాస్తుంది. ఇక ఈ చిత్రంలో హీరోగా నటించిన శ్రీ విష్ణుకు చాలా ఈ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టిందని చెప్పాలి.
ఈ సినిమా రికార్డులను నెలకొల్పిందని చెప్పవచ్చు. అయితే మొదట అసలు ఈ కథ కు ఈ చిత్రం లో హీరో గా అనుకున్నది ఇతన్ని కాదంట. అయితే మరి ఎవరికి ఈ కథను చెప్పారు? అసలు అతని ఎందుకు మిస్ చేసుకున్నాడు? ఈ చిత్రాన్ని వదులుకున్న హీరో ఎవరు అని తెలుసుకున్న నెటీజన్లు తెగ మండిపడుతున్నారు ఆ నటుడిపై.. అయితే మొదట ఈ చిత్రం యొక్క కథను డైరెక్టర్ రామ్ అబ్బరాజు ముందుగా టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కి వివరించాడట. అయితే కథ తనకు నచ్చినప్పటికీ ఈ కథకు హీరో శ్రీ విష్ణు బాగా సూట్ అవుతాడని అతనితో తీస్తే చాలా మంచిగా హిట్ అవుతుందని ఈ కథను సందీప్ కిషన్ స్వయంగా అతనికి సజెస్ట్ చేశాడట.
మరి అదే కాకుండా అదే సమయానికి సందీప్ కిషన్ మైఖేల్ అనే చిత్రంలో బిజీగా ఉండడం వల్ల ఈ కథ నచ్చినప్పటికీ వదులుకోలేక తప్ప లేదట. ఆ కారణం చేతనే సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రం శ్రీ విష్ణు చేతికి వెళ్ళింది. అయితే చాలా మంది నెటిజన్లు మాత్రం సందీప్ కిషన్ కన్నా శ్రీ విష్ణు బాగా నటించగలడంటూ కామెంట్లు చేస్తున్నారు. చేతులారా సందీప్ కిషన్ ఇలాంటి బ్లాక్ బస్టర్ (Samajavaragamana) ను వదులుకొని దురదృష్టవంతుడు లిస్ట్ లోకి చేరిపోయాడు.