Home Cinema Jr NTR : ఎన్టీఆర్ దుబాయి వెళ్లి ఎం చేసాడో తెలుసా.. వైరల్ అవుతున్న వీడియో..

Jr NTR : ఎన్టీఆర్ దుబాయి వెళ్లి ఎం చేసాడో తెలుసా.. వైరల్ అవుతున్న వీడియో..

do-you-know-what-ntr-did-when-he-went-to-dubai-for-the-siima-awards-2023

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ని ( What NTR did when he went to Dubai ) ఇంకా డిసైడ్ చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా తర్వాత ఎంత బిజీగా ఉన్నారు మనందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ శుక్రవారం నాడు దుబాయిలో జరిగిన సైమా అవార్డు ఫంక్షన్కు ( సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ) వేడుకల్లో పాల్గొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ వెళ్లారు.

Jr Ntr-Dubia-SIIMA-Awards

అంతటి వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయుడిగా నిలిచాడు. సైమా అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడు అవార్డు లభించింది. ఇక ఈ వార్త వినగానే నందమూరి అభిమానుల్లో ( What NTR did when he went to Dubai ) ఆనందం వెల్లివిరిసింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ లో కూడా ఎంతో ఆనందం కలిగింది. ఇక సైమా అవార్డ్స్ వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు, ఎమోషనల్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మామూలుగానే ఎన్టీఆర్ చాలా మాటకారి.. నందమూరి వంశం అంటేనే మాటల బలం చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.

See also  Nagarjuna: ఇల్లు వదిలి పోతున్న నాగచైతన్య కన్నీళ్ళతో సతమతమవుతున్న నాగార్జున..?? అసలు కారణం ఇదేనా.!!

Jr Ntr-speech-Dubia

జూనియర్ ఎన్టీఆర్ కి ఉత్తమ నటుడుగా పురస్కారాన్ని అందుకున్న తర్వాత ఆయన మాట్లాడిన మాటలు అందరిలో అభిమానంతో కూడిన ఆనందాన్ని నింపాయి. జూనియర్ ఎన్టీఆర్ తన మాటలు మొదలుపెట్టి తనను మళ్ళీ మళ్ళీ నమ్ముతున్న జక్కన్న అంటే దర్శకుడు రాజమౌళి కి మొదట థాంక్స్ చెప్పుకున్నారు. నిజమే ( What NTR did when he went to Dubai ) రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్టూడెంట్ నెంబర్ వన్ తో మొదలైన వీళ్ళ ప్రయాణం అలా వెళుతూనే ఉంది. రాజమౌళి తీసిన 12 సినిమాల్లో నాలుగు సినిమాలు ఎన్టీఆర్ తోనే ఉన్నాయి. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ ఇలా వాళ్ళిద్దరి బంధం ఎంత గట్టిదో ఎన్టీఆర్ తలుచుకుని రాజమౌళికి థాంక్స్ చెప్పారు.

See also  Nagababu : నాగబాబు గుండెని మూడు ముక్కలు చేసిన వరుణ్ మరియు నిహారిక!

Jr Ntr-SIIMA - 2023

అలాగే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో తనతో పాటు నటించిన రామ్ చరణ్ ని బ్రదర్ అని పిలిచి తనతో కలిసి నటించినందుకు థాంక్స్ చెప్పాడు. ఆ తర్వాత అభిమానుల గురించి మాట్లాడుతూ.. నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డప్పుడల్లా.. నన్ను పట్టుకుని పైకి లేపింది మీరే. నా కళ్ళ వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకూ వాళ్ళు కూడా బాధపడ్డారు. నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు వాళ్లు కూడా నవ్వారు. నా అభిమాన సోదరులందరికీ పాదాభివందనాలు అని జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన ఎమోషనల్ స్పీచ్ అభిమానుల గుండెల్లో ఆనందం కలిగి.. కళ్ళలో ఆనంద భాష్పాలు వచ్చాయి. అలా జూనియర్ ఎన్టీఆర్ సైమా అవార్డ్స్ వేడుకల కోసం దుబాయ్ వెళ్లి అభిమానుల కళ్ళనిండా ఆనంద భాష్పాలను నింపారు..