
Tollywood Heroines : తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్స్ ఎంటర్ అయ్యారు. హీరోల కంటే హీరోయిన్స్ కి అవకాశాలు ఎంత స్పీడ్ గా వస్తాయో.. అలాగే హీరోయిన్స్ ఇంట్లో వాళ్ళను ఒప్పించుకుని ఇండస్ట్రీలో ( Tollywood heroines aged when they entered ) అడుగు పెట్టడం మాత్రం అంతే కష్టం. అసలు హీరోయిన్స్ ఎంటర్ అయినప్పుడు వాళ్ళ వయసెంత? వాళ్ళు ఏం చదువుకుంటున్నారనేది చాలావరకు చాలామందికి తెలియదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలుగుతున్న మన తారలు ఏ వయసులో సినిమాలోకి ఎంటర్ అయ్యారో ఒక్కసారి తెలుసుకుందాం..
శ్రీలీల.. ప్రస్తుతం శ్రీలీల స్టార్ హీరోయిన్స్ ల తో పోటీ పడుతుంది. తక్కువ సమయం అయినా కూడా ఇప్పటికీ ఆమె చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. చాలా మంది హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో కన్నడ సినిమా ద్వారా 2019లో అడుగు పెట్టింది. అప్పటికి ఆమె వయసు 18 సంవత్సరాలు. ప్రస్తుతం ( Tollywood heroines aged when they entered ) శ్రీలీల వయసు 22 సంవత్సరాలు. సాయి పల్లవి.. నేచురల్ హీరోయిన్గా.. తాను అన్ని విధాలుగా సాటిస్ఫై అయితేనే.. తన పెట్టిన రూల్స్ కి ఒప్పుకుంటేనే అలాంటి పాత్రలు నటించే హీరోయిన్. ఫిదా సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అందరిని ఫిదా చేసేసింది సాయి పల్లవి. మలయాళీ చిత్రాల్లో చిన్నప్పుడు కూడా నటించింది. హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన మొదటి సినిమా ప్రేమమ్. అప్పుడు సాయి పల్లవి వయసు 23 సంవత్సరాలు.
కీర్తి సురేష్.. మహానటి సావిత్రిని ఒక్కసారి మళ్ళీ అందరికీ కన్నుల విందుగా కనిపించేలా చేసిన గొప్ప నటి. ఎన్నో అవార్డులను అందుకుని తెలుగు ప్రాక్షకుల మన్నులను పొందిన నటి కీర్తి సురేష్. 2000 సంవత్సరంలో బాల నటిగా ఎంటర్ అయ్యి 2013లో హీరోయిన్ గా మలయాళం చిత్రంలో గీతాంజలి సినిమాలో నటించింది. ఈమె ( Tollywood heroines aged when they entered ) మొదటి సినిమాకి ఈమె వయసు 21 సంవత్సరాలు. పూజా హెగ్డే.. పూజా హెగ్డే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముకుంద సినిమాతో ఎంటర్ అయింది. కానీ ఈమె మొదటి సినిమా తమిళ చిత్రం. అప్పుడు పూజా హెగ్డే వయసు 22 సంవత్సరాలు. సమంత.. సమంతకి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా యావత్ భారతదేశం లో కూడా ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. సమంత ఏం మాయ చేసావే సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంటర్ అయింది.
2010లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాని ఆమె మాజీ భర్త నాగచైతన్యతో కలిసి నటించగా.. అప్పుడు ఈమె వయసు 23 సంవత్సరాలు. తమన్నా.. మిల్కీ బ్యూటీ తమన్న మొదటి చిత్రం 2005లో విడుదలైంది. అప్పుడు తమన్నా వయసు 15 సంవత్సరాలు మాత్రమే. అదే సంవత్సరం తెలుగులో కూడా మంచు మనోజ్ తో కలిసి నటించిన సినిమా ద్వారా పరిచయమైంది. కృతి శెట్టి.. వైష్ణవి తేజ్ తో కలిసి కృతి శెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటిసారిగా పరిచయమైంది. ఇప్పుడు టాలీవుడ్లో వరస ఆఫర్లు ఉన్నాయి. కృతి శెట్టి తెలుగులో నటించిన మొదటి సినిమా ఉప్పెన. అప్పుడు ఆమె వయసు 17 సంవత్సరాలని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 17 సంవత్సరాల వయసులో ఆమె ఎంత బాగా నటించిందో.. ఎంత క్రేజ్ సంపాదించిందో మనందరికీ తెలిసిందే..