Home Cinema Sri Devi: ఆ హీరో తో రొమాన్స్ చేయాలంటే అంతగా భయపడి పోయిందట శ్రీదేవి కారణం...

Sri Devi: ఆ హీరో తో రొమాన్స్ చేయాలంటే అంతగా భయపడి పోయిందట శ్రీదేవి కారణం ఏంటో తెలుసా.?

SriDevi Romance: అతిలోకసుందరిగా పేరు సంపాదించిన నటి శ్రీదేవి కి ఆ హీరోతో రొమాన్స్ చేయడం అంటే భయమా.? అంటే అవుననే చెబుతున్నారు ఇండస్ట్రీకి చెందిన పలు పెద్దలు.. ఒకానొకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ మంది హీరోయిన్ లుగా స్టార్ హీరోయిన్ లుగా మరి కొద్ది మందే చలామణి అవుతుండేవారు. అందువలన చాలా మంది స్టార్ హీరోలు సైతం ఒకే హీరోయిన్ లతో పదుల సంఖ్యలో చిత్రాలలో నటిస్తూ ఉండేవారు.

do-you-know-the-reason-why-sridevi-was-so-afraid-to-romance-that-hero

అలా ఎంతో మంది స్టార్ హీరోలు అయిన నందమూరి తారక రామారావు, సూపర్ స్టార్ కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు వంటి సీనియర్ హీరోలతో సినిమాలలో నటిస్తూ ఉండేవారు అప్పటికి హీరోయిన్లు.. ఎందుకంటే అప్పట్లో హీరోయిన్ లు అంటే కొదువ ఉండేది. అందుకే నటించిన హీరోల పక్కనే జత కడుతూ ఉండేవారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు శ్రీదేవి వీళ్లిద్దరు కలిసి నటించిన చిత్రాలు ముద్దుల మొగుడు, ప్రేమ కానుక, ప్రేమాభిషేకం, బంగారు కానుక, శ్రీరంగనీతులు వంటి మొదలైన చిత్రాలు వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చాయి. ఇక అప్పట్లోనే అతిలోకసుందరిగా పేరు గాంచిన శ్రీదేవి దాదాపు రెండు తరాల హీరోలతో సినిమాలను నటించింది.

See also  Sakshi Dhoni: పవన్ కళ్యాణ్ - ప్రభాస్ లతో చిత్రాలు తీయాలంటే మా ఆస్తులను అమ్ముకోవలంటూ సంచలనమైన కామెంట్స్ చేసిన సాక్షి ధోని.

do-you-know-the-reason-why-sridevi-was-so-afraid-to-romance-that-hero

అలా సీనియర్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ గార్లతో సినిమాలలో నటించిన ఆ తరం అయిపోయాక..ఆ  తర్వాతి తరం చిరంజీవి, నాగార్జున గార్లతో నటించే అవకాశం అతిలోక సుందరి శ్రీదేవికి లభించిందట. ఏఎన్నార్ తర్వాత అక్కినేని నాగార్జునతో శ్రీదేవి గారికి నటించే అవకాశం లభించి వీరిద్దరి కాంబినేషన్లో గోవింద గోవింద, ఆఖరిపోరాటం తదితర చిత్రాలు వచ్చాయి. అయితే వీళ్ళిద్దరూ కలిసి నటించిన ఆఖరిపోరాటం చిత్రంలో శ్రీదేవికి అవకాశం వచ్చినప్పుడు ఈ చిత్రంలో భాగంగా నాగార్జునతో శ్రీదేవి రొమాన్స్ (SriDevi Romance) చేయాలంటే తెగ భయపడిపోయదట. ఎందుకంటే నాగార్జున అప్పట్లో కుర్ర హీరో..

See also  Janhvi Kapoor: జాన్వీ కపూర్ వేసుకున్న ఆ పొట్టి బ్లూ కలర్ డ్రెస్ రేట్ ఎంతో తెలిస్తే మీ దిమ్మ తిరిగిపోతది.

do-you-know-the-reason-why-sridevi-was-so-afraid-to-romance-that-hero

అలాంటి కుర్ర హీరోతో రొమాన్స్ చేస్తే అభిమానులు ఆ చిత్రాన్ని ఎలా అర్థం చేసుకుంటారని తెగ భయపడి పోయిందట. కేవలం ఇదే కాకుండా నేను ఏఎన్నార్ తో కూడా నటించాను. ఆయనతో నటించి ఆయన పక్కన మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని.. ప్రస్తుతం అదే కొడుకు పక్కన నటించి ఆయన కొడుకు పక్కన నటిస్తే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు. మళ్ళీ ఆ చిత్రంలో పలు రొమాన్స్ సన్నివేశాలు అంటున్నారని తెగ భయపడి పోయిందట. ఇక ఆ చిత్ర దర్శకుడైన దర్శకేంద్రుడు రాఘవేంద్రునికి ఈ విషయం తెలియజేసిందంట. కానీ దర్శకేంద్రుడు ఊరుకుంటాడా.. శ్రీదేవిని పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఒప్పించి ఆఖరి పోరాటం చిత్రంలో నాగార్జునతో కలిసి నటించేలా చేశాడు. ఇక ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని కైవసం చేసుకుంది.