Actress Rohini : సినీ ఇండస్ట్రీ లో మహిళలపై ఎలాంటి వేధింపులు జరుగుతున్నాయో ప్రతీరోజు మనం చూస్తూనే ఉన్నాం. అవకాశాలు ఇవ్వాలంటే బదులుగా కొంతమంది నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఎలాంటి కమిట్మెంట్స్ అడుగుతున్నారో పలువురు హీరోయిన్లు బహిరంగంగానే చెప్పుకొని బాధపడ్డారు. దీనిపై సోషల్ మీడియా లో కూడా పెద్ద ఎత్తున చర్చ నడించింది. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఇప్పటికీ ఈ అంశం ట్రెండింగ్ లోనే ఉంది. ఇదంతా పక్కన పెడితే మలయాళం ఫిలిం ఇండస్ట్రీ మహిళలు ఎదురుకుంటున్న సమస్యల గురించి జస్టీస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ఎలాంటి సంచలనం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఈ క్రమంలో పలువురు హీరోయిన్లు, క్యారక్టర్ ఆర్టిస్టులు తమకు ఎదురైనా చేదు అనుభవాలను బహిరంగంగా, ధైర్యంగా చెప్పుకున్నారు. దీనిపై ప్రముఖ నటి రోహిణి(actress Rohini) (విలన్ రఘువరన్ మాజీ భార్య) తనదైన శైలిలో స్పందించింది, ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘సుమారుగా 7 ఏళ్ళ పాటు సుదీర్ఘంగా మహిళలు ఎదురుకుంటున్న సమస్యలను అధ్యయనం చేసి జస్టీస్ హేమ కమిటీ ఈ నివేదిక సిద్ధం చేసింది.
ఈ ఏడేళ్లలో మహిళలు సినీ పరిశ్రమలో పని చేస్తున్న వర్కింగ్ కండిషన్స్, రెమ్యూనరేషన్స్, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం, వాళ్ళు కొంతమంది నుండి ఎదురుకుంటున్న లైంగిక వేధింపులు తదితర అంశాలపై జస్టీస్ హేమ కమిటీ అధ్యయనం చేసింది’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. కాబట్టి ఇక నుండి ఎవరైనా లైంగిక వేధింపులకు గురైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరమే లేదని నటి రోహిణి ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అలా మాట్లాడడం వల్ల జరిగే ఉపయోగాలు ఏమి లేవని, ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెప్పేయండి, ఎవరి బెదిరింపులు కూడా పట్టించుకోవద్దు అంటూ రోహిణి ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
ఒకప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగిన రోహిణి, ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తుంది. ఈమె లేని సినిమా అంటూ ఏది లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ ఇలా అన్నీ భాషల్లో సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా అంటే అది రోహిణి మాత్రమే. మనసులో ఉన్న మాటలను నిర్మొహమాటంగా చెప్పే రోహిణి, ఈరోజు ఇలా మాట్లాడడం బాగా వైరల్ అయ్యింది.