Home Cinema Rajamouli : ఎన్టీఆర్ ని రాజమౌళి అంత నీచంగా తిట్టేవాడా..? వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్..

Rajamouli : ఎన్టీఆర్ ని రాజమౌళి అంత నీచంగా తిట్టేవాడా..? వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్..

Rajamouli : టాలీవుడ్ లో నేటి తరం స్టార్ హీరోలలో మాస్ హీరో ఎవరు అంటే మన అందరికీ టక్కుమని గుర్తుకు వచ్చే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి మనవడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్, ఇండస్ట్రీ కి వచ్చిన రెండేళ్ల లోపే తిరుగులేని మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించి చరిత్ర సృష్టించాడు. ఆయనకీ మాస్ ఫ్యాన్ బేస్ వచ్చిన రోజుల్లో ఆయన వయస్సు కేవలం 18 ఏళ్ళు మాత్రమే(Rajamouli Scolding Ntr). చదువుకోవాల్సిన వయస్సులో ఆయన ఇండస్ట్రీ ని ఏలుతున్నాడు, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగరాస్తూ, నెంబర్ 1 సీట్ పై కన్నేశాడు. అయితే ఎన్టీఆర్ నేడు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం దర్శక ధీరుడు రాజమౌళినే.

See also  Singer Sunitha : అందంలో సునీతాని డామినేట్ చేస్తున్న ఆమె కూతురి లేటెస్ట్ లుక్ చూశారా?

rajamouli-ntr

ఆయన కెరీర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చిన సినిమాలన్నీ కూడా రాజమౌళి దర్శకత్వం లో వచ్చినవే అని చెప్పాలి. ఇప్పుడు రీసెంట్ గా గ్లోబల్ వైడ్ క్రేజ్ కూడా RRR సినిమా తో రాజమౌళి ద్వారానే వచ్చింది. అయితే రాజమౌళికి మాత్రం మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ని చూడగానే ‘వీడేందిరా బాబు ఇలా ఉన్నాడు.. నేను పెద్ద హీరో కి దర్శకత్వం వహించాలని కోరికతో ఇండస్ట్రీ కి వస్తే, మొదటి సినిమాతో ఇలాంటోడితో చెయ్యాల్సి వస్తుందేంటి’ అని అనుకున్నాడట. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ లోని టాలెంట్ చూసి చేస్తే ఇలాంటి హీరో తోనే చెయ్యాలి అని అనుకునేవాడట.

See also  Heros Marriage: వచ్చే నెల జూన్ లో ఇంతమంది హీరోల పెళ్లిళ్లు జరగనున్నాయా.? ఫ్యాన్స్ కు పండగే..

rajamouli

ఇక ఆ సినిమా తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరో మూడు సినిమాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ కెరీర్ పూర్తిగా డౌన్ అయిపోయిన రోజుల్లో, ఇక ఈయన సినిమాలు ప్రేక్షకులు చూసే పరిస్థితిలో లేరు అని అనుకుంటున్నా సమయంలో రాజమౌళి తో చేసిన ‘యమదొంగ’ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ ని ఎలా కాపాడిందో అందరికీ తెలిసిందే. అప్పటి వరకు బండగా కనిపించే ఎన్టీఆర్, ఈ సినిమాతో సన్నగా, నాజూగ్గా కనిపించాడు. అప్పటి నుండి ఎన్టీఆర్ అదే రేంజ్ లుక్ ని మైంటైన్ చేస్తూ వస్తున్నది, ఇప్పుడు ఏకంగా ఆయన సిక్స్ ప్యాక్ కూడా మైంటైన్ చేస్తూ ముందుకెళ్తున్నాడు.

See also  Varun Tej Lavanya marriage date : వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి డేట్ ని మార్చేసిన చిరంజీవి..

ntr-rajamouli

అలా ఎన్టీఆర్ కెరీర్ కి రాజమౌళి అంతలా కీలకంగా మారాడు(Rajamouli Scolding Ntr), భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూడాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం కెజిఫ్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి తన 30వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ దేవర. ఈ సినిమాలో అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గ నటిస్తుంది. టాలీవుడ్ లో ఇదే తినకు మొదటి సినిమా. మొదటి సినిమాకే ఎన్టీఆర్ తో ఛాన్స్ కొట్టేసిన అదృష్ట వంతురాలు అని ఫాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఎపుడు రిలీజ్ అనేదానికి ఇంక ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.