Home Cinema Mahesh Babu – Gopi Chand: మహేష్ బాబు-గోపీచంద్ కాంబోలో ఏ బ్లాక్ బస్టర్ మూవీ...

Mahesh Babu – Gopi Chand: మహేష్ బాబు-గోపీచంద్ కాంబోలో ఏ బ్లాక్ బస్టర్ మూవీ మిస్ అయ్యిందో తెలుసా?

Mahesh Babu – Gopi Chand: మనం ఆల్రెడీ వీరిద్దరి కాంబోలో ఒక సినిమా చూశాము ఆ చిత్రమే నిజం. మరి మిస్ అయిన ఆ బ్లాక్ బస్టర్ చిత్రం అసలు ఏంటని మీకు ప్రశ్న రావచ్చు.? ఇక ఈ నిజం చిత్రానికి తేజ దర్శకత్వం వహించగా.. ఇందులో హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినగా మ్యాచ్ హీరో గోపీచంద్ విలన్ గా నటించి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. 2003 వ సంవత్సరంలో ఈ చిత్రం విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని మాత్రం అందించక పోయినప్పటికీ నటనపరంగా మహేష్ బాబుకు అలాగే గోపిచంద్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే ఇక్కడ చాలా మందికి తెలియని నిజమేంటంటే మహేష్ బాబు గోపీచంద్ కాంబోలో నిజం చిత్రం కంటే ముందే ఓ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ రావాల్సి ఉంది. కానీ అది గోపీచంద్ కు జస్ట్ లో మిస్ అయిందని చెప్పాలి.

See also  Bhola Shankar : భోళాశంకర్ ఎంత రాబడితే హిట్ లెక్కల్లోకి వెళ్తుందంటే..

did-you-know-gopi-chand-and-mahesh-babu-missed-this-blockbuster-multi-starrer-movie

మరి ఆ చిత్రం ఏంటని ఆలోచిస్తున్నారా? మరి ఆ చిత్రం ఏంటో కాదు మహేష్ బాబు లైఫ్ జర్నీలో బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ మూవీ ఒక్కడు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోగా మహేష్ బాబు హీరోయిన్ గా భూమిక నటించిన విలన్ క్యారెక్టర్ లో ప్రకాష్ రాజు అదరగొట్టారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎమ్మెస్ రాజు నిర్మించినటువంటి ఈ యాక్షన్ రొమాంటిక్ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ చిత్రం 2003 వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా బరిలోకి దిగి సంచలమైన విజయాన్ని సాధించి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ చిత్రంలో మహేష్ బాబు – భూమికల మధ్య జరిగిన కెమిస్ట్రీ ఎంతగానో ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్ తీరాలకి వెళ్లేలా చేసింది.

See also  Jabardast Hari: జబ్బర్దస్థ్ హరి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు లో కీలకమైన నిజాలు..

did-you-know-gopi-chand-and-mahesh-babu-missed-this-blockbuster-multi-starrer-movie

ఇక ఈ చిత్రానికి స్వరాలు అందించిన వారు మణిశర్మ కాగా.. ఓబుల్ రెడ్డి పాత్రలో ప్రకాష్ రాజ్ కూడా అదరగొట్టాడని చెప్పాలి.. సినిమా మొత్తంలో హీరో మహేష్ బాబు పాత్ర తరువాత హైలెట్ అయింది అంటే విలన్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ దే.. అయితే ఈ పాత్ర కోసమే గోపీచంద్ సంప్రదించగా.. గోపీచంద్ సరే అన్నాడు. మరి ప్రకాష్ రాజ్ ఎలా వచ్చాడు? అసలేం జరిగిందో.. ఇప్పుడు చూద్దాం. అయితే మొదట విలన్ గా అనుకున్నది ప్రకాష్ రాజ్ నే. కానీ అప్పుడు చాలా సినిమాల్లో బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్ ఈ చిత్రానికి డేట్స్ కాళీ లేవని చెప్పడంతో ఆ తర్వాత చిత్ర గోపీచంద్ సంప్రదించగా వెంటనే సరే అన్నాడట కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో విలన్ క్యారెక్టర్ లో తలుక్కుమన్నాడు.

See also  Keerthy Suresh: కీర్తి సురేష్ ప్రేమ వ్యవహారంపై తొలిసారి నోరు విప్పిన తన తల్లి..!! షాకింగ్ నిజాలు.??

did-you-know-gopi-chand-and-mahesh-babu-missed-this-blockbuster-multi-starrer-movie

అప్పటికే జయం సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసి ప్రేక్షకులను అలరించిన గోపీచంద్. ఒక్కడు స్టోరీ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసాడట. అయితే ప్రకాష్ రాజు కూడా ఒక్కడు స్టోరీ బాగా నచ్చేయడంతో మిగిలిన సినిమాలు అన్నీ పక్కన పెట్టేసి దర్శకుడు కి కాల్ చేసి మరి నేను విలన్ క్యారెక్టర్ లో నటిస్తానని అందుకోసం అన్ని చిత్రాలు పక్కన పెట్టేస్తానని చెప్పాడట. దాంతో చేసేదేమీ లేక గోపీచంద్ ని సైడ్ పెట్టేశారు. అలా మహేష్ బాబు గోపీచంద్ వీరిద్దరి కాంబోలో సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రం మిస్సయింది. కాగా (Mahesh Babu – Gopi Chand) తర్వాత అదే గోపీచంద్ నిజం చిత్రంలో మహేష్ బాబుకు విలన్ గా నటించాడు.