Srihari : శ్రీహరి ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలిసిందే. సినిమా రంగంలో అడుగుపెట్టినప్పుడు కమెడియన్గా, విలన్ గా నటించిన శ్రీహరి తర్వాత తన అద్భుతమైన నటనతో నెమ్మదిగా కొన్ని సినిమాలకు హీరోగా కూడా ( Srihari married two times ) నటించి.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి మంచి పాత్రలో నటించడం జరిగింది. ఒకటే మరణం ఒకటే జననం ఒకటే గమ్యం ఒకటే గమనం అంటూ భద్రాచలంలో ఆయన నటించిన పాట సూపర్ డూపర్ హిట్ అయింది. శ్రీహరి ప్రముఖ ఐటమ్ డాన్సర్ డిస్కో శాంతిని పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. డిస్కో శాంతి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ అవుదామని అడుగు పెట్టిందట.
కానీ ఆమె మొదట నటించిన రెండు సినిమాలు కూడా కొన్ని అనుకోని పరిస్థితుల వలన షూటింగ్ ఆగిపోయి.. అవి పూర్తి కాలేదంట. ఆ తర్వాత ఆమె హీరోయిన్గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. ఆమె కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ వచ్చిందంట. డిస్కో శాంతికి ఆరుగురు సోదరిలు ఉండగా.. వాళ్ళు ( Srihari married two times ) పెళ్లిళ్లు కూడా ఆమె పైనే బాధ్యత ఉండడంతో.. ఆర్థిక పరిస్థితిని తట్టుకోలేక.. ఆమె ఐటెం సాంగ్స్ లో డాన్సర్ గా కూడా అవకాశాల్ని చేజిక్కించుకోవడం జరిగిందట. ఇలా ఒక మనిషి జీవితంలో ఎన్ని సమస్యలు ఉంటాయో.. మనకు తెలియదు కానీ.. వాళ్ళు చేసే పాత్రను చూసి ఇలాంటి డాన్స్ వేస్తుందేమిటి? అలా నటిస్తుంది ఏంటి?
అని ఈజీగా అనుకుంటారు కానీ.. దాన్ని వృత్తిపరంగానే తీసుకొని వాళ్ల కుటుంబాన్ని ఉద్ధరించడానికి అంత కష్టపడే వాళ్ళు నిజమైన హీరోయిన్స్ అని గుర్తించి తీరాలి. డిస్కో శాంతిని శ్రీహరి ప్రేమించాడంట. అయితే శ్రీహరి ఫ్రెండ్స్ నువ్వు ఇప్పటిలో శాంతిని పెళ్లి చేసుకోకపోతే ఇంకెప్పటికీ చేసుకోలేవని భయపెట్టారంట. అప్పుడు శ్రీహరి డిస్కో శాంతి ( Srihari married two times ) గుడికి వెళుతుందని తెలుసుకుని.. అక్కడికి వెళ్లి ఆమెకు తాళి కట్టాడంట. అయితే ఆమె ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని.. చాలా బాధ్యతలు ఉన్నాయని చెప్పడంతో.. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాలో నటించొచ్చు అని చెప్పాడంట శ్రీహరి. అయితే శ్రీహరి కట్టిన తాళిబొట్టుని దేవుడి హుండీలో వేసిందంట డిస్కో శాంతి.
ఇంత ప్రేమగా శ్రీహరి కట్టిన తాళిని దేవుడి హుండీలో వెయ్యడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? డిస్కో శాంతి అలా చేయడం వెనుక పెద్ద కారణమే ఉందట. అసలు కారణం శ్రీహరి అంటే ఇష్టం లేక కాదు.. ఆమె పెళ్లి చేసుకుంటే తాళిబొట్టుని దేవుడు హుండీలో వేస్తానని మొక్కుకుందట. అలా ఆమె మెడలో శ్రీహరి కట్టిన మొదటి తాళిని దేవుడి హుండీలో వేసి.. మొక్కు తీర్చుకుందట. అందువలన శ్రీహరి డిస్కో శాంతి మెడలో వెంటనే నల్లపూసలు తాడు తెచ్చి వేసాడంట. అలా కొంతకాలం తర్వాత వీళ్ళిద్దరికీ 1996లో అందరి ఎదురుగా పెళ్లి జరిగిందంట. ఇలా వీళ్ళిద్దరికీ రెండు సార్లు పెళ్లి జరిగిందంట. ఈ చక్కటి ప్రేమ జంటకి ఇద్దరూ మగ పిల్లలు కూడా పుట్టారు. ఇలా శ్రీహరికి రెండుసార్లు పెళ్లి జరిగిందన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.