Home Cinema Oscar Award: ఆస్కార్ అవార్డు విలువ ఎంతో.. ఆ దర్శకుడు ఎంతకు అమ్మేశాడో తెలిస్తే అవాక్కు...

Oscar Award: ఆస్కార్ అవార్డు విలువ ఎంతో.. ఆ దర్శకుడు ఎంతకు అమ్మేశాడో తెలిస్తే అవాక్కు అవుతారు..

Detailed facts on Oscar Award: ఏ రంగంలో నైనా ఏదైనా సాధిస్తే ఒక పురస్కారం అనేది ఉంటాది. సినిమా రంగంలో ఏదైనా సాధిస్తే అవార్డ్స్ ఇస్తారు. అవార్డు ను సంపాదించుకున్నప్పుడు ఆ గ్రహీత చాలా ఆనందంగా ఉంటారు. అలాగే ఆ సినిమా రిలేటెడ్ టీం అంతా కూడా ఆనందంగా ఉంటారు. ఏ సినిమాకయితే వాళ్ళు పని చేసారో ఆ సినిమాలో ఎందుకైనా, ఏ అవార్డు వచ్చినా చాలా ఆనందపడిపోతారు. ప్రపంచం మొత్తంలో గుర్తింపుని ఇచ్చే అవార్డు అంటే అది ఆస్కార్ అవార్డు అని తెలిసినదే. ఈ ఆస్కార్ అవార్డు అందుకోవాలంటే చాలా కష్టం. అసలు అవార్డు అందుకోవడం ఏమిటి, దీనికి నామినెటే అవ్వడమే పెద్ద విషయం. ఆస్కార్ అవార్డు గురించి తెలుగువాళ్లు పెద్దగా పట్టించుకునేవారు కాదు. అంటే దాని మీద శ్రద్ద పెట్టకా, దాని గురించి పెద్దగా తెలీదు.

See also  Sreeleela : నా గురించి ఆ మేటర్స్ ముఖం మీద బాలయ్య ఎలా చెప్పగలిగేవారో అంటూ ఎమోషనల్ గా బయటపెట్టిన శ్రీలీల.

detailed-facts-on-oscar-award

కానీ ఇప్పుడు మాత్రం మన తెలుగు వాళ్ళందరూ ఆస్కార్ అవార్డు ఫంక్షన్ ( Detailed facts on Oscar Award )గురించి ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన సినిమాలో నాటు నాటు పాటు ఆస్కార్ కి ఎన్నిక అవ్వడం నిజంగా మన తెలుగు వారు గర్వించ తగ్గ విషయం. ఆస్కార్ అవార్డుల వేడుక మరికొన్ని గంట‌ల్లో ప్రారంభం కావడానికి సిద్ధంగా అంటే, ఆదివారం రోజు సాయంత్రం లాస్ ఏంజిల్స్ లో ఈ అవార్డుల ప్రదానోత్సవం కోసం సర్వం సిద్దమైంది. ఇందులో రిజల్ట్ కోసం రాజమౌళి టీం మొత్తం ఆశక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఒకేవేళ అవార్డు గాని గెలుచుకుంటే, ఆర్ఆర్ఆర్ టీమ్ స్థాయి ఎక్కడికో వెళ్ళిపోతాది. తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి, మన దర్శకుడు హీరోల గురించి యావత్ ప్రపంచం చెప్పుకుంటుంది.

See also  Anu Emmanuel: నా లవ్ ఎఫైర్ అల్లు శిరీష్ తో మొదటగా తెలిసింది మా అమ్మకే అంటూ షాకింగ్ విషయం వెల్లడించిన అని ఇమాన్యుయల్.

detailed-facts-on-oscar-award

అసలు ఆస్కార్ అవార్డు విలువ ఎంత? దానిని ఎవరికైనా అమ్ముకోవచ్చా అనే అనుమానం వస్తే.. హా అమ్ముకోవచ్చని చెప్తున్నారు. ఆస్కార్ అవార్డు 13.5 ఇంచుల హైట్, 4 కేజీల వెయిట్ ఉంటుంది. ఒక్కో ఆస్కార్ అవార్డు తయారీకి సుమారు 400 డాలర్స్ ఖర్చు అవుతుంది. ఇండియన్ కరెన్సీలో రూ.38,807రూపాయలు. 1929లో డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీ దీనిని స్టార్ట్ చేశారు. అది నిమ్మదిగా ఇప్పటికి ఇంత ఫెమస్ అయ్యింది. వరల్డ్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే నెంబర్ వన్‌ అవార్డ్ అయిన ఆస్కార్ ను అందుకోవాల‌నే ఆశ ప్రతీ సినిమా వాళ్లకి ఉంటాది. గతంలో అమెరికన్ డైరెక్టర్ ఆర్సన్ వెల్స్(director orson welles) ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ ద‌క్కించుకున్నారు. అయితే అత‌డు తాను గెలుచుకున్న అవార్డుని ఆర్థిక ఇబ్బందుల కారణంగా వేలం వేసి ఏకంగా రూ..6.5 కోట్లకు అమ్ముకున్నారు.

See also  Mahesh - Namrata: మహేష్ మాటకు ఎదురు తిరిగుతున్న నమ్రత.. బంగారం లాంటి జంట ఇలాంటి నిర్ణయం ఎవరికోసం?

detailed-facts-on-oscar-award

ఆ తరవాత అంత ప్రతిష్టాత్మాకమైన అవార్డు ని అమ్మేయడం, ఆస్కార్ వాళ్లకి అవమానంగా అనిపించి, దానిని ఇంకెప్పుడు ఎవ్వరికీ అమ్ముకునే రైట్ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. ఆ అవార్డు అమ్మాలనుకుంటే కేవెలం ఆ కమిటీకి మాత్రమే అమ్మాలి అని రూల్ పెట్టింది. అకాడమీ సబ్యులకు ఈ అవార్డు అమ్మితే కేవలం 1 డాలర్ ఇస్తారంట. అంటే కేవలం 82 రూపాయలన్నమాట..