Jabardast Hari: జబర్దస్త్ షో తో ఎంతో మందిని బుల్లితెర నటులు తమ ట్యాలెంట్ అక్కడ చూపించి ఆ సక్సెస్ తో వెండితెరపై ఆఫర్లను అందుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి షోలో ఒక పాత్ర దొరకాలి అన్నా.. ఒక అవకాశం ఇవ్వాలన్నా ఎందరో ప్రయత్నిస్తే చాలా కొందరికి మాత్రమే దొరుకుతుంది. అలాంటిది జబర్దస్త్ ( Jabbardasth Hari sandalwood smuggling ) లాంటి షోలో ఒక నటుడుగా నటిస్తూ.. హరి ఈరోజు ఎలాంటి పని చేశాడో? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు. ఒక మనిషి బ్రతకడానికి మూడు పూటలా తిండి తినడానికి.. దేనికింత ఆరాటపడుతున్నాడు? ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నాడు? తప్పుడు దారి ఎత్తుకోవాల్సిన కర్మేం పట్టింది? అని బాధ కూడా కలుగుతుంది.
తనకంటూ ఒక పని దొరికి.. తానంటూ ఒక రంగంలో ఒక మంచి షోలో నటుడుగా నటిస్తూ కూడా.. ఎలాంటి పని చేశాడో తెలిసి ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడుతున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ సినిమాలో తగ్గేదేలే అని నటిస్తే.. అది కేవలం సినిమా కాబట్టి హీరో హీరోయిజమ్ చూపించినా.. ఏమి చేసినా.. పోలీసులు ( Jabbardasth Hari sandalwood smuggling ) ఏమి చేయలేరు కానీ.. రియల్ లైఫ్ లో అలా కాదు. చిన్న తప్పు చేసినా పోలీసులు వెంటాడుతారు. ఆ నిజం తెలిసి చేశాడో తెలియక చేసాడో హరి తెలీదు గానీ.. ఎర్రచందనం స్మగ్లింగ్ లో భాగమయ్యాడు. ఇతను చేసిన ఈ పనికి అతనితో పాటు నటించే వాళ్లకి ఎంత ఇబ్బందికరమో.. ఎన్ని ప్రశ్నలు ఎదుర్కోవాలో.. ఎలాంటి పరిస్థితులను చూడాలో అనే ఆలోచన కూడా లేకుండా హరి ఇలాంటి పని చేశాడు.
అయితే హరి జబర్దస్త్ షోలో కి రాకముందే ఇలాంటి పని చేసేవాడా? వచ్చిన తర్వాత ఇలాంటిది మొదలుపెట్టాడా ? అనేది ఇంకా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలియాలి. కానీ ప్రస్తుతం అయితే హరి గురించి సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో దాదాపు 60 లక్షల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ.. కిషోర్ అనే వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు. అతని దర్యాప్తు చేయగా హరి పేరు బయటికి వచ్చింది. ఆదివారం రాత్రి 11 గంటలకు పుంగనూరు పోలీస్ ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి పోలీసులకు ( Jabbardasth Hari sandalwood smuggling ) ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు వెంటనే అలెర్ట్ అయ్యి స్పాట్ దగ్గరికి వెళ్లేసరికి.. అక్కడ రెండు వాహనాలు ఉన్నాయి. వారిలో ఒకరు పోలీసులకు పట్టు పడగా.. అక్రమ తరలింపులో హరిబాబుకు పేరు కూడా బయటికి రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది విన్న జబర్దస్త్ ఆడియన్స్ కి, నెటిజనులకి, హరి తోటి నటీనటులకి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
చిత్తూరు జిల్లాలోని 2021లో బాకరా పేట దగ్గర ఎర్రచందనం స్మగ్లింగ్లో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. అప్పుడు అందులో హరిబాబు తప్పించుకున్నాడని ఇప్పుడు వార్తల్లోకి వస్తుంది. అప్పట్లో హరి కి అంత పెద్ద గుర్తింపు లేదని.. ఇప్పుడు జబర్దస్త్ షో ద్వారా అతను ఎలా ఉంటాడో అందరికీ తెలుస్తుందని అంటున్నారు. అయితే ఇప్పుడు హరి పరార్ లో ఉండడం వల్ల పోలీసులు అతను గురించి వెతుకుతున్నారు. ఏదేమైనా బుల్లితెర మీద అంత మంచి షో లో తనకి పాత్ర దొరికితే చక్కగా చేసుకుని.. తరవాత వెండి ధర మీదకు వచ్చి నెమ్మదిగా జీవితాన్ని హాయిగా గడపాల్సిన మనిషి.. ఇలాంటి తప్పుడు దోవలోనే నడవడం.. ఎన్నాళ్ళైనా అలాంటి మెంటాలిటీ మార్చుకోకపోవడం.. నిజంగా ఇలాంటి వాళ్ళని చూసి కోప్పడాలో? జాలి పడాలో? జీవితం విలువ తెలియనందుకు బాధపడాలో? కూడా అర్థం కావడం లేదు.