ఈరోజుల్లో పాప్యులర్ అవ్వడం చాలా సులభంగానే ఉంది. ముందు రోజుల్లో నలుగురికి ఎవరి గురించైనా తెలియాలంటే, చాలా కష్టపడాల్సి వచ్చేది. ట్యాలెంట్ ఉన్నవారు కూడా ఎలా వారి ట్యాలెంట్ నలుగురికి తెలియజేయాలో తెలీక, దానికి అవసరమైన ప్లాటుఫార్మ్స్ లోకి ఎంట్రీ అనేది చాలా కష్టంగా ఉండటం వలన అదొక కలలా ఉండిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు, నీలో ట్యాలెంట్ ఉంటె సోషల్ మీడియా అనే వేదిక ద్వారా ఎంతమందికైనా ప్రతిభను రీచ్ చెయ్యవచ్చు.
టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి మనందరికీ తెలుసు. కూతురు సుప్రీత గురించి ఇంకా బాగా తెలుసు. సుప్రీత ఇంకా సినిమా ఇండస్ట్రీలోకి రాకుండానే బాగా పాపులర్ అయ్యింది. సురేఖ వానితో కలిసి అనేక వీడియోలు రీల్స్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు బాగా దగ్గరయింది.అయితే సోషల్ మీడియాలో గాని, సినిమాలలో గాని పాప్యులర్ అయిన వారి పై నెటిజనులు కొంత క్రేజ్ ఎక్కువగా ఉంటాది.
సెలబ్రెటీస్ గురించి, వాళ్ళ పెళ్లిళ్ల గురించి, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎం చేస్తున్నారు అనే దానిమీద బాగా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే సురేఖ వాణి కూతూరు సుప్రీత పెళ్లి గురించి ఒక వార్త బాగా వైరల్ అయ్యింది. సుప్రీత తెలుగు వారు వాలెంటైన్స్ డే స్పెషల్ అంటూ నిర్వహించిన ఓ రెండు ప్రేమ మేఘాలు అనే ప్రోగ్రాంలో పాల్గొనింది. యూట్యూబ్ నిఖిల్ విజయేంద్ర సింహతో జంటగా స్టేజి షోలో కనిపించి సర్ప్రైజ్ ఇచ్చింది.
ఈ షో లో వీళ్ళిద్దరూ కలసి వాళ్ళ జర్నీ గురించి చెప్తూ ఎంటర్టైన్ చేసారు. అంతే దీనితో వీళ్లిద్దరి మధ్య లవ్ నడుస్తుందని, త్వరలో వీళ్ళు పెళ్లి చేసుకుంటారని ఎవరికీ వారు ఊహా ఆలోచనలతో నెట్ లో వైరల్ అవుతున్నాయి.