ప్రభాస్ అనుష్క జంట మీద అభిమానులకు ఎంతటి అభిమానముందో మనందరికీ తెలుసు. బాహుబలి లాంటి సినిమాతో ఈ జంట యావత్ ప్రపంచానికి పరిచయం అయ్యింది. ప్రభాస్ అనుష్కల సినిమాలలో వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. వీరిద్దరి రొమాంటిక్ సీన్స్ తో, సినిమాని ఒక లెవల్ లో హిట్ పొజీషన్ కి తీసుకుని వెళ్తారు. సినిమాలోనే కాదు, బయట కూడా వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్.
గత కొంత కాలంగా, ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అంటూ.. ప్రభాస్ అభిమానులు, సినీ అభిమానులు, సినిమా ఇండస్ట్రీ అందరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రభాస్ ని ప్రతీ ఇంటర్వ్యూ లో మీ పెళ్లి ఎప్పుడు అని అడుగుతూనే ఉన్నా, తన పెళ్లి మాటను చక్కగా దాటించేసి.. ఇంటర్వ్యూ పూర్తి చేసుకుంటాడు. ఇంకా గట్టిగా అడిగితే, సల్మాన్ ఖాన్ పెళ్లి అయ్యాక నేను చేసుకుంటాను అని చెప్పి తప్పించుకుంటున్నాడు.
ప్రభాస్ అనుష్కలు లవ్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని అభిమానులు అంటూనే ఉన్నారు. మా ఇద్దరి మధ్య అలాంటిదేమి లేదు, మేము మంచి స్నేహితులమని ప్రభాస్ చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చాడు. బయటకు ఎన్ని చెప్పినా.. వీళ్ళదరూ కలిసినప్పుడు వాళ్ళ బిహేవియర్, ఒకరి పై ఒకరికి ఉన్న ప్రేమ అందరికీ క్లియర్ గా వీళ్ళు ప్రేమలో ఉన్నారని అర్ధమవుతుంది.
రీసెంట్ గా.. అనుష్క పేరెంట్స్ ప్రభాస్ అమ్మగారిని కలవడానికి వెళ్లారు. వాళ్ళు ఖచ్చితంగా ప్రభాస్ అనుష్కల పెళ్లి గురించి మాట్లాడటానికి వెళ్లి ఉంటారని అభిమానులు అనుకుంటున్నారు. ఈ ప్లాన్ కూడా ప్రభాస్ అనుష్క లదే అయ్యి ఉంటాదని, మొత్తానికి ప్రేమ దొంగలు దొరికారని అభిమానులు అనుకుంటున్నారు.