Home Cinema Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వాచ్ ధర.. దాని హైలెట్ వెనుక సీక్రెట్ తెలిస్తే షాక్...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వాచ్ ధర.. దాని హైలెట్ వెనుక సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు..

Comments on Pawan Kalyan watch: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా ఆ లెక్కే వేరబ్బా. ఆయన సినిమాలు, ఆయన అభిమానులు, ఆయన యాక్షన్ రియాక్షన్ అన్నీ ఒక లెవెల్లో ఉంటాయి. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎన్ని సినిమాలు చేశారు? అందులో ఎన్ని సూపర్ హిట్ అయ్యాయి అనే లెక్క వేసుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సినిమా హిట్ అయినా, ఫెయిల్ అయినా కూడా ఆయనకి ఉన్న క్రేజ్ మాత్రం పెరగటమే గాని, తగ్గేదెలే అన్నట్టు పెరుగుతూనే ఉంది. అయితే ఆయన క్రేజ్ అనేది ఎప్పటికైనా తగ్గుతాదా అంటే, ఏమైనా ఇప్పటి జనేరేషన్ లో కొంచెం ఫాస్ట్ గా ఉండే హీరోలు దూసుకుపోతే, ఏమైనా కొంచెం తగ్గచ్ఛేమో తప్ప.. మామూలుగా ఆయన క్రేజ్ ని తగ్గించడం చాలా కష్టం.అందుకే పవన్ కళ్యాణ్ అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో రెండిటిలో సర్వైవ్ అవ్వగలుగుతున్నారు.

See also  IBOMMA - Chiranjeevi : చిరంజీవి సినిమాలపై సంచలన కామెంట్స్ చేసిన ఐబొమ్మ!

comments-on-pawan-kalyan-watch

అలాగే సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేడకుండా, పవన్ కళ్యాణ్ సినిమాలకు రెమ్యునిరేషన్ మాత్రం పెరుగుతూనే వస్తుంది. సముద్రఖుని దర్శకత్వంలో వినోదయ సిత్తం రీమేక్‌ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సంగతి ఆందరికీ తెలిసినదే. ఈ సినిమాలో సాయిధర్మతేజ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న రెమ్యునిరేషన్ గురించి చాల వార్తలు వచ్చాయి. రోజుకి కోట్ల లెక్కల చొప్పున తీసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. రోజుకి రెండుకోట్లు, మూడు కోట్లు అంటూ వార్తలు అయితే వచ్చేవి గాని, అన్నన్నీ కోట్లు కేవలం హీరోకి మాత్రమే ఇస్తే, ఇంక ఆ సినిమా పూర్తి అవ్వడానికి ఎంత అవుతాది ఎంత తిరిగి రాబడతారనేదే సంశయం.

comments-on-pawan-kalyan-watch

ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమాను పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉండగా, మధ్యలో వినోదయ సిత్తం అనే రీమేక్‌ను సెట్ చేశాడు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ ఎవరి మాట వినడు గాని, త్రివిక్రమ్ మాట మాత్రం చాలా వరకు వింటాడని టాక్ ఉంది. ప్రతీ సెలబ్రెటీ వెనుక ఎవరో ఒకరు సలహాలు ఇచ్చే వాళ్ళు, బాగును చూసేవాళ్ళు, నమ్మకస్థులు ఉంటారు. సినిమాకి ప్రమోషన్ అనేది ఎంత అవసరమో మనందరికీ తెలుసు. అది ఎంత పెద్ద హీరో సినిమా అయినా కూడా ప్రోపర్ పబ్లిసిటీ లేకపోతే ఆ సినిమా కలెక్షన్ తేవడం కష్టంగానే అనిపిస్తున్న రోజులు ఇవి. అందుకే సినిమా మాటలు మొదలయ్యిన దగ్గర నుంచి, ఏదో ఒక అప్డేట్ ఈ సినిమా పై ఇస్తూ ఉంటున్నారు.

See also  Ram Charan: యాక్టింగ్ రాదని రామ్ చరణ్ ని ఎక్కిరించారు.. కానీ ఆస్కార్ అవార్డు కొట్టి సత్తా చూపించాడు..

comments-on-pawan-kalyan-watch

అలాగే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కి సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా టీజర్ ప్రత్యేకంగా చూపించడానికి వచ్చాడు. ఆ టైం లో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్ ని ( Comments on Pawan Kalyan watch ) ఫోటో తీసి దీని ధర ఎంతో తెలుసా అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. IWC పైలట్స్ టాప్ గన్ 41 ఎంఎం మెన్స్ వాచ్ 5 లక్షల 87 వేలు. ఈ వాచ్ ధర తెలిసి కొందరు ఆశ్చర్య పోగా, అసలు ఇలాంటివన్నీ ఆ సినిమా ప్రమోషన్ కోసం ఇంత సీన్ క్రియేట్ చేసి , హైకెట్ చేస్తారని.. ఇదంతా అక్కడ ఉన్న ఇద్దరు హీరోల సినిమా ప్రమోషన్ అవ్వడానికని కొందరు నెటిజనులు వాపోతున్నారు. సినిమా ప్రమోషన్ అంటే సినిమా గురించి చెప్పడమే కాదు, ఇలా హీరోల వస్తువులు గురించి కూడా హైలెట్ చేసి, సినిమా ప్రమోషన్ చేసుకుంటారా అని కొందరు షాక్ అవుతున్నారు.