Home Cinema Naga Chaithanya: పాపం.. రెండుసార్లు నాగచైతన్య కెరీర్ ని నాశనం చేసిన వ్యక్తి ఎవరంటే.. మీరేమంటారు?

Naga Chaithanya: పాపం.. రెండుసార్లు నాగచైతన్య కెరీర్ ని నాశనం చేసిన వ్యక్తి ఎవరంటే.. మీరేమంటారు?

మనం చూసే రెండున్నర గంటల సినిమా వెనుక ఎంతో శ్రమ,పెట్టుబడి,ఆశ,కష్టాలు,నష్టాలు ఉంటాయి. కొన్ని నెలలపాటు ఎంతోమంది ఎన్నో కష్టాలు పడితే తప్పు ఏ ఒక్కరి వలన సినిమా పూర్తి కాదు. ఒక్క సినిమా ప్లాప్ అయితే, దాని వెనుక ఎన్ని జీవితాలు ఎన్ని కోల్పోతాయో అందరికీ తెలీదు.

అందుకే సినిమా వాళ్ళు ఎక్కువగా కృషితో పాటు అదృష్టాన్ని కూడా నమ్ముతారు. అంతేకాదు.. సెంటిమెంట్స్ ని కూడా నమ్ముతారు. ఎందుకు వీళ్లకి ఇంత సెంటిమెంట్స్ అని అనుకుంటారు గాని, పాపం ఎవరి బాధలు వాళ్ళవి. అక్కినేని నాగచైతన్య విషయంలో కూడా ఇప్ప్పుడు ఒక సెంటిమెంట్ టాపిక్ గురించి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. రెండుసార్లు నాగచైతన్య కెరీర్ ని నాశనం చేసిన వ్యక్తి అతనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

See also  Lavanya Tripathi: ఆ స్టార్ హీరో పడరానిపాట్లు పడ్డాడట మెగా కోడలు లావణ్యతో రోమాన్స్ చేసేందుకు. ఎవరో తెలుసా.?

కొన్ని కాంబినేషన్స్ ఎలా అంటే, పలానా హీరోకి.. పలనా హీరోయిన్, పలనా దర్శకుడు, పలాన నిర్మాత ఇలా వాళ్ళతో చేస్తే లక్ బాగుంటుందని, కొన్ని కాంబినేషన్స్ అస్సలు మంచివి కాదని, ఖచ్చితంగా ప్లాప్ అవుతాయని నమ్ముతారు. అలాగే నాగచైతన్య, దిల్ రాజు కాంబినేషన్ అస్సలు మంచిది కాదని చైతు ఫాన్స్ కి అనిపిస్తుంది. దిల్ రాజు వలన వాళ్ళ హీరో కి నష్టం తప్పితే ఇంకేమి లేదంటున్నారు. చైతు మొదటి సినిమా జోష్ దిల్ రాజు నిర్మించగా.. అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

See also  Ram Charan: ఆ స్టార్ హీరో కి అల్లుడు కావాల్సిన రామ్ చరణ్ చిరు చేసిన ఈ పని వల్ల ఇంత జరిగిందా.?

ఆ తరవాత వాళ్ళిద్దరి కాంబోలో సినిమాలు లేవు. చైతు కష్టపడి ఇప్పుడిప్పుడే సక్సెస్ అవుతుంటే.. లాస్ట్ ఇయర్ వీరిద్దరి కాంబోలో థాంక్యూ సినిమా వచ్చింది. ఇలాంటి సినిమా చైతు ఎందుకు చేసాడని ఫాన్స్ బాధపడేంతగా సినిమా ఫ్లాప్ అయ్యింది. రెండుసార్లు నాగచైతన్య కెరీర్ ని నాశనం చేసిన వ్యక్తి దిల్ రాజు అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి సెంటిమెంట్ వారిది కానీ, మీరేమంటారు?