Clashes Between Manchu Brother’s: మంచు కుటుంబంలో మంచి అన్నదమ్ములుగా పేరు తెచ్చుకున్న మంచి బ్రదర్స్ విష్ణు అలాగే మనోజ్ మధ్య విపరీతమైన గొడవలు జరుగుతున్నాయని చాలా కాలం నుంచి సోషల్ మీడియాలో కుప్పలు తిప్పలుగా వార్తలు సాగుతున్నాయని మనందరికీ ఆ సంగతి తెలుసు.. అయితే వీళ్ళిద్దరి మధ్య ఆస్తుల గురించే గొడవలు అవుతున్నాయని.. దానివల్లే మంచి మనోజ్ ఇల్లు వదిలి వేరే ఇంటికి వెళ్లిపోయాడని వార్తలు వినిపించడం జరిగింది . కాగా ఇటీవల జరిగిన కొన్ని కారణాల చేత ఆ వార్తకు మరింత బలం తోడైంది. కొద్దిరోజుల క్రితం మంచు మనోజ్ ఇంటివాడైన విషయం మనందరికీ తెలిసిందే..
భూమా మౌనిక రెడ్డి తో మంచు మనోజ్ వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ ఇది రెండవ వివాహం అని అందరికీ తెలుసు.. కాగా ఈ వివాహం మంచు లక్ష్మి నివాసంలో మంచు మనోజ్-మౌనికల పెళ్లి చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. అంగరంగా వైభవంగా జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులకు పాల్గొని నూతన నవ దంపతులిద్దర్నీ ఆశీర్వదించే దీవెనలు అందించాడు. కాగా ఈ వివాహానికి మంచు మనోజ్ అయితే పెళ్లికి ఒక అన్నలా కాకుండా జస్ట్ నార్మల్ గెస్ట్ గా వచ్చి కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంది వెళ్ళిపోయాడట.
ఒకే రక్తం పంచుకొని పుట్టిన సొంత తమ్ముడి పెళ్లికి కేవలం అరగంట మాత్రమే ఉండి వెళ్ళడమేంటని నేటిజన్స్ విష్ణు ను ఓ రేంజ్ లో వేసుకున్నారు. ఇదే సమయంలో మంచు మనోజ్ తో ఏర్పడ్డ గొడవల కారణాల వల్లనే మంచు విష్ణు అలా చేసాడన్న వార్తలు వినిపించాయి.. కానీ ఇటివలే తెలిసిన విషయమేంటంటే అన్నదమ్ముల మధ్య ఏర్పడ్డ గొడవకు గల కారణం బయటకు వచ్చింది. నిజానికి చెప్పాలంటే వాస్తవానికి మంచు మనోజ్ భూమా మౌనికను పెళ్లి చేసుకోవడం అలాగే ఆయన భార్య విరానికకు ఎంత మాత్రం అస్సలు ఇష్టం లేనే లేదంట. (Clashes Between Manchu Brother’s)
ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ కుటుంబానికి చెందిన విరానికకు ఫస్ట్ నుంచే టిడిపికి చెందిన భూమా కుటుంబం అంటే అస్సలు నచ్చేది కాదంట ఇష్టం లేదట.. వాళ్ళ మధ్య కుటుంబ పరంగా ఎన్నో విభేదాలు ఉన్నాయని దానివల్ల అందుకే ఈ సంబంధం వద్దు అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా మనోజ్ లెక్క చేయకుండా మౌనిక తో డేటింగ్ చేశాడట, ఆపై తన వివాహం చేసుకున్నాడు. అదే విషయం ఏమాత్రం మంచు విష్ణు భార్య విరానికకు అసలు నచ్చడం లేదట.. దాంతో ఆమెనే మంచు మనోజ్ మంచు విష్ణు ల మధ్య చిచ్చు పెట్టిందని మంచు బ్రదర్స్ ను విడగొట్టిందని ఎన్నో గుసగుసలు ప్రస్తుతం వ్యాపిస్తున్నాయి.