
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ఏకైక వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రామ్ చరణ్ సినిమా రంగంలో అడుగుపెట్టినప్పుడు అనేక కామెంట్స్ వచ్చాయి. రామ్ చరణ్ చిరంజీవి అంత పెద్ద హీరో అవ్వడం కష్టం అని అందరూ ( Chiranjeevi wish come true ) అనుకున్నారు. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి కోరికని.. ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీర్చాడు. అంటే తండ్రిని మించిన తనయుడు అయ్యాడని గర్వంగా చెప్పుకుంటున్నారు మెగా అభిమానులు.
నిజంగానే రామ్ చరణ్ సాధించిన ఈ విజయం మెగా అభిమానులకు మాత్రమే కాదు.. సినీ రంగానికి, సినీ అభిమానులకి, ప్రతి తల్లిదండ్రులకు కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చేదే. ఏ కొడుక్కి ఇలా.. తండ్రికి ఉన్న కోరికను తీర్చే ( Chiranjeevi wish come true ) అదృష్టం ఉంటుంది? ఈ కొడుక్కి అవకాశం రావడం అదృష్టమే.. అలా దాన్ని అందరూ గుర్తించడం ఇంకా అదృష్టమే అని అనుకుంటున్నారు.ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. 16 ఏళ్ల క్రితం చిరంజీవి ఎమోషనల్ గా మాట్లాడిన కొన్ని మాటలు ఈ రోజుకి నిజమయ్యాయి. ఆ నిజం కూడా రామ్ చరణ్ రూపంలో నిలువెత్తుగా కనిపిస్తుంది.
16 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకల్లో మాట్లాడిన కొన్ని ఎమోషనల్ మాటలను ఇప్పుడు నిజం చేశాడు రామ్ చరణ్. గోవా ఫిలిం ఫెస్టివల్ లో మన తెలుగు నటుల ఫోటోలు కనిపించడం లేదు అంటూ ( Chiranjeevi wish come true ) భావోద్వేగానికి గురయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. మన ఇండస్ట్రీలో ఉన్న ఎస్వీఆర్, ఏఎన్ఆర్,ఎన్టీఆర్ వంటి గొప్ప నటులకు సరైన గౌరవం లభించలేదు అని ఎంతో ఎమోషనల్ గా చెప్పాడు చిరంజీవి. అప్పుడు చిరంజీవి మాట్లాడిన ఎమోషనల్ మాట్లాడడం ఈరోజు రాంచరణ్ పూర్తి చేసి చూపించాడు. ఈ సంవత్సరం జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో రామ్ చరణ్ ఫోటో అక్కడ కనిపించింది.
ఈ వేడుకల్లో చిరంజీవి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు అక్కడే తన కొడుకు రామ్ చరణ్ ఫొటో కనిపించడంతో.. మెగా ఫాన్సీ సంతోషంతో పొంగిపోతున్నారు. పక్కనే అనుష్క దేవసేన ఫోటో కూడా ఉంది. దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ గా మారింది. ఇక మెగా అభిమానులు, నెటిజనులు అయితే చిరంజీవి అప్పుడు మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకొని.. రామ్ చరణ్ నిలువెత్తు రూపంలో అవి నిజం చేస్తూ తండ్రి కోరికను తీరుస్తూ ఎదురుగా అక్కడ ఫోటో రూపంలో కనిపించడం నిజంగా చిరంజీవికి తండ్రిగా ఎంతో ఆనందం కలిగించి ఉంటుందని అని అందరూ అనుకుంటున్నారు.