
Chiranjeevi – Ram Charan : మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా రంగంలోకి చిన్న చిన్న పాత్రలతో అడుగుపెట్టి ఎంతో కృషిచేసి స్వయం కృషితో మెగాస్టార్ లెవెల్ కి ఎదిగి.. ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్దగా నిలబడిన స్థానానికి వచ్చారు. అయితే చిరంజీవి తర్వాత ఆయన వారసుడు రామ్ చరణ్ అంత కష్టం లేకుండా ( Chiranjeevi Charan and srihari ) తండ్రి పేరుతో సినిమా రంగంలో అడుగు పెట్టడం చాలా ఈజీ అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎన్నో కష్టాలు పడి ఎంత కృషి చేస్తే ఒక నటుడుగా నిలబడతామో, ఎలా ఉంటే అందరిలో సభాష్ అనిపించకుంటామో చిరంజీవికి బాగా తెలుసు. అలా అని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇలా ఉండు అని చెప్తే అందరూ వినే పరిస్థితి కూడా ఉండదు.
బిజీ బిజీ ప్రపంచంలో తండ్రే కొడుక్కి అన్ని చెప్పాలి అంటే కూడా కుదరదు. అలా అని కొడుకు ఎలా ఉన్నా పర్లేదులే నా సంపాదన పనిలో నేను పరుగులు పెట్టాలనుకుంటే.. సంపాదించడమే అనవసరం. చిరంజీవి మాత్రం ఎంత బిజీగా ఉన్నా.. అన్ని బాధ్యతలు నిర్వర్తించే మనిషి. ఇలా అన్ని విషయాలను బ్యాలెన్స్ చేసుకోగలిగే గొప్ప ( Chiranjeevi Charan and srihari ) వ్యక్తి కాబట్టే.. చిరంజీవి ఈరోజు ఆయన కుటుంబాన్ని, ఆయన అభిమానుల్ని, ఆయన కెరీర్ ని అన్నిటిని సమతూల్యంగా కాపాడుకుంటూ వస్తున్నారు. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ సినిమా రంగంలో అడుగు పెట్టాలి అని డిసైడ్ అయిన తర్వాత చిరంజీవి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు అంట. రామ్ చరణ్ హీరోగా పరిచయం చేయాలనుకున్న తర్వాత చిరంజీవి శ్రీహరికి ఫోన్ చేశారంట.
రామ్ చరణ్ ని హీరో చేద్దామనుకుంటున్నారని.. తన గురించి అన్ని నువ్వే దగ్గరుండి చూసుకోవాలని.. తనకి కాస్త ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పారంట. తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి ఆయన కొడుక్కి ట్రైనింగ్ ఇమ్మని ( Chiranjeevi Charan and srihari ) చెప్పారని శ్రీహరి ఎంతగానో పొంగిపోయాడంట. దాంతో శ్రీహరి రామ్ చరణ్ కి కొన్ని ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు తగ్గేదేలే అన్నట్టుగా చాలా గట్టిగా చెప్పేవాడు అంట. రామ్ చరణ్ కి శ్రీహరిని చూస్తే భయపడేవాడంట. అయినా కూడా శ్రీహరి చెప్పిన కొన్ని పాయింట్స్ ని జాగ్రత్తగా పట్టుకొని ఎలా చేయాలి? ఎలా బిహేవ్ చేయాలని తెలుసుకుని కేవలం అతి తక్కువ రోజుల్లోనే సూపర్ అనిపించుకున్నాడట రామ్ చరణ్.
అయితే ఆ తర్వాత రామ్ చరణ్ శ్రీహరి కలిసి మగధీర సినిమా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో వీళ్ళిద్దరి బంధం చాలా బాగుంటది. అలా బయట కూడా వీళ్ళిద్దరి బంధం అలానే ఉంటుందంట. ఆ సినిమా షూటింగ్లో వీళ్ళిద్దరికీ బాగా మంచి రిలేషన్ ఏర్పడిందంట. ఆ తర్వాత శ్రీహరి అంటే భయం పోయి.. ప్రియమైన స్నేహభావం, ఇష్టం రామ్ చరణ్ కి పెరిగిందంట. ఇలా మొత్తానికి చిరంజీవి ఒక మనిషికి చెప్పి మరి.. రామ్ చరణ్ ని భయపెట్టాడన్నమాట అని అందరూ అనుకుంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజెర్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందని ఆయన అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.